21 May, 2026 | 4:50 AM

మెడికల్ అసోసియేషన్ పిలుపుమేరకు మెడికల్ షాపులు బంద్

21-05-2026 12:06 AM

ఆళ్ళపల్లి, మే 20 (విజయక్రాంతి): ఆల్ ఇండియామెడికల్ అసోసియేషన్  పిలుపుమేరకు బుధవారం  మండలంలో మెడికల్ షాపులు బంద్ చేసి నిరసన ప్రకటించారు.

ఈ సందర్భంగా ఇల్లందు మెడికల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు సీనియర్ కెమిస్ట్ నయుంపాషా మాట్లాడుతూ ఆన్లైన్ మందుల అమ్మకాలను నిషేదించాలని, కార్పొరేట్ సంస్థలకు భారీ డిస్కౌంట్ ఇవ్వద్దని, నకిలీ మందులను అరికట్టాలని ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ పిలుపుమేరకు ఇల్లందు మెడికల్ అసోసియేషన్ ఆదేశాల మేరకు మండల పరిధిలోని మందులు షాపులు విజయవంతంగా బంద్ చేసినట్లు తెలిపారు .ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎమర్జెన్సీ మందులను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.. ఈ బందు విజయవంతానికి సహకరించిన ఆళ్ల పెళ్లి, మర్కోడు మెడికల్ షాపుల యాజమాన్యాలకి, మండల ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ వైద్యులు సిరి నోముల నరేష్ ఖాలిద్ తదితరులు పాల్గొన్నారు.