17 August, 2026 | 10:40 PM

పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు ఇస్తాం.. డిసిసి అధ్యక్షులు..

17-08-2026 09:36 PM

బోథ్ ఆగస్టు 17 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం పనిచేసిన వారికి భవిష్యత్తులో తగిన గుర్తింపునిస్తామని డిసిసి అధ్యక్షులు జాదవ్ నరేష్ పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ మండలంలోని పలు గ్రామాలకు చెందిన పార్టీ కార్యకర్తలతో పాటు వార్డు సభ్యులతో కలిసి డిసిసి అధ్యక్షుడుని కలిశారు.

ఈ సందర్భంగా పార్టీ పట్టిష్టతపై చర్చించడం జరిగింది. పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపునిస్తామని అయితే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని డిసిసి అధ్యక్షులు సూచించారు. నామినేటెడ్ పదవుల విషయంలో హైక్ అమౌంట్ తీసుకొని నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్నారు. పార్టీకి అందిన నివేదిక ప్రకారం పదవుల పంపకాలు ఉంటాయని పనిచేసిన వారిని పదవుల్లో కూర్చోబెడతారన్నారు. ఆయన వెంట మండలానికి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.