17 August, 2026 | 9:45 PM

కొత్తభాది గ్రామ సభ రసబాస... ఉద్రిక్తత...

17-08-2026 08:40 PM

జి.పి నిధుల లెక్కలు చూపాలంటూ గ్రామస్తుల డిమాండ్..

గ్రామసభ వాయిదా... సర్పంచ్ పై గ్రామస్తుల ఆగ్రహం..

బాన్సువాడ, ఆగస్టు 17 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొత్తబాది గ్రామంలో నిర్వహించిన గ్రామసభ రసాభాసగా, ఉద్రిక్తంగా మారింది. గ్రామ అభివృద్ధి పనులు, నిధుల వినియోగం, పెండింగ్ బిల్లులపై సర్పంచ్ ను గ్రామస్తులు నిలదీశారు. సరైన సమాధానాలు రాకపోవడంతో గ్రామసభను వాయిదా వేశారు. గ్రామసభకు పెద్దలు, వార్డు సభ్యులు, యువ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మేజర్ జిపి అయినప్పటికీ సభకు వచ్చిన వారికి కుర్చీలు కూడా ఏర్పాటు చేయలేదని గ్రామస్తులు ఆరోపించారు.

గత ఐదేళ్ల సర్పంచ్ భార్య అంకిత సాయిగౌడ్ కూడా సభకు రాలేదని అన్నారు. గ్రామంలో జరిగిన పనుల వివరాలు, సెంట్రల్ ఫండ్స్, బ్యాంక్ బ్యాలెన్స్, నిధుల లెక్కలు అడిగారు. దేనికైనా గత ఐదేళ్లలో బిల్లులు పెండింగ్ ఉన్నాయని సర్పంచ్ చెప్పారని, లెక్కలు అడిగితే దారి మళ్లించారని తెలిపారు. లెక్కలు చూపాలని పట్టుబట్టడంతో గత సెక్రటరీపై నెట్టేశారని ఆరోపించారు. BRS పార్టీ అధ్యక్షులు కొత్తబాది దేవి సింగ్ గత సెక్రటరీని పిలిపించి లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రామ అభివృద్ధి, నిధుల వినియోగం, పెండింగ్ బిల్లుల వివరాలు పారదర్శకంగా వెల్లడించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.