1 August, 2026 | 2:57 AM

గుర్తు తెలియని అస్థిపంజరం లభ్యం

01-08-2026 01:57 AM

రామచంద్రపురం, జూలై 30: రామచంద్రపురం మండలం ఈదుల నాగులపల్లి గ్రామ శివారులో ఉన్న యూని యాడ్స్ కంపెనీ భూమి, సర్వే నంబర్ 135లో పురుష అస్థిపంజరం లభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్నిస్థానికులు గమనించి బి.డి.ఎల్ భానుర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. లభ్యమైన ఆధారాలను బట్టి అది ఒక గుర్తుతెలియని పురుషుని మృతదేహంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అస్థిపంజరం సమీపంలో ఒక నీలం రంగు డ్రాయర్, ఒక షర్టు లభించాయి. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.