టామ్ కామ్‌కు మరిన్ని బాధ్యతలు
- శిక్షణ నుంచి ఉద్యోగం వరకు చేయూత
- విదేశాలకు సేవలను విస్తరించాలి
- స్కిల్ యూనివర్సిటీలో రీసెర్చ్ సెంటర్
- ఏటీసీల్లో అత్యాధునిక కోర్సులకు ప్రాధాన్యం
- డిమాండ్ మేరకు నర్సింగ్ కళాశాలలు
- శక్తి శాఖ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి) : విదేశీ ఉద్యోగాల కోసం తెలంగాణ యువతకు అవసరమైన శిక్షణ, ఉద్యోగ మేళాలు, పాస్‌పోర్టులు ఇప్పించడంతో పాటు ఆయా దేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతను తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. విదేశీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని, అక్కడకు వెళ్లిన ఉద్యోగార్థులకు సమస్యలు ఎదురైతే వారికి అండగా నిలిచి న్యాయం చేయాలని, అందుకు సంస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు.
కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి శుక్రవారం శక్తి శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఉత్త ర తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు మధ్య ప్రాచ్య దేశాలకు వెళ్తుంటారని, ఈ క్రమంలో వారు ఏజెంట్ల చేతిలో మోసపోయి ఇబ్బందిపడుతున్నారని సీఎం తెలిపారు. కార్మికులను విదేశాలకు తరలించే ఏజెంట్ల వివరాలు సేకరించి.. వారు పంపించే ప్రతి వ్యక్తి వివరాలు నమోదు చేయాలని స్పష్టం చేశారు.
ఈ వ్యవహారాల పర్యవేక్షణకు టామ్‌కామ్‌కు మాజీ ఐఎఫ్‌ఎస్ అధికారిని సీఈవోగా నియమిస్తామని వెల్లడించారు. ఉద్యోగార్థులకు లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్‌లోనూ శిక్షణ ఇప్పించాలని సూచించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో నూతన ఆవిష్కరణలకు అవసరమైన రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జర్మనీ, జపనీస్, కొరియన్, చైనీస్, రష్యన్ తదితరు భాషలు నేర్చుకునేందుకు వీలుగా స్కిల్ యూనివర్సిటీలో ప్రత్యేక విభాగం నెలకొల్పాలన్నారు.
విదేశీ భాషలు నేర్పేందుకు ఆ భాషలో పట్టున్న స్థానికులతో పాటు ఆ యా దేశాలకు చెందిన శిక్షకులను రప్పించాలని సీఎం పేర్కొన్నారు. ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్‌షిపులు ఇచ్చినట్లే, బ్లూ కాలర్ జాబ్‌లకు శి క్షణ పొందేవారందరికీ స్కాలర్‌షిపులు ఇచ్చే అంశంపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. యూనివ ర్సిటీ ప్రాంగ ణంలో రీలొకేటెడ్ చెట్లను నాటాలని సూచించారు.
పెద్ద కంపెనీల్లో ఇంటర్నిషిప్‌కు అవకాశం కల్పించండి..
ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలు, ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కళాశాలల్లో చది వే విద్యార్థులకు పెద్ద కంపెనీల్లో ఇంటర్నిషిప్ చేసే అవకాశం కల్పించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచింఆరు. చదువుకుంటూనే, ఇంట ర్నిషిప్ చేయడం ద్వారా వారికి ఉపకారవేతనం లభిస్తుందని, భవిష్యత్‌లో చేయబో యే ఉద్యోగానికి సంబంధించిన నైపుణ్యాలు నేర్చుకుంటారని పేర్కొన్నారు. ఏటీసీల్లో ఈ వీ సర్వీసులు, డ్రోన్ టెక్నాలజీకి సంబంధించిన కోర్సులు ప్రవేశపెట్టాలని సీఎం సూచించారు.
ఈవీల వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో వాటిని సర్వీసింగ్ చేయగలిగిన వారు అవసరమని, వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం భారీగా పెరుగుతున్నందున డ్రో న్ టెక్నాలజీ కోర్సు ఉండాలని స్పష్టం చే శారు. దేశీయంగా, విదేశాల్లోనూ నర్సుల సేవలకు భారీ డిమాండ్ ఉందన్నారు.
అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరు గుతుండడంతో ఇంటికో నర్సు అవసరమవుతున్నారని, పెరుగుతున్న డిమాండ్‌కు అ నుగుణంగా నర్సింగ్ కళాశాలలకు అనుమతులు ఇస్తున్నట్లు సీఎం తెలిపారు. సమీక్షలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ శ్రీధర్, శక్తి కార్యదర్శి హరిచందన, ఉపాధి, శిక్షణ డైరెక్టర్ నిర్మలా కాంతి వెస్లీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.






