1 August, 2026 | 3:08 AM

కొండాపూర్‌లో సౌత్ ఇండియన్ బ్యాంక్

01-08-2026 02:23 AM

గచ్చిబౌలి రోడ్‌లో కొత్త శాఖ, ఏటీఏం ప్రారంభం

హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణ మార్కెట్లలో తమ వ్యాపార విస్తరణ వ్యూహాన్ని కొనసాగిస్తూ, సౌత్ ఇండియన్ బ్యాంక్ నేడు దేశంలోని ప్రముఖ బిజినెస్, టెక్నాలజీ హబ్‌లలో ఒకటైన కొండాపూర్‌లోని గచ్ఛిబౌలి రోడ్‌లో సరికొత్త బ్రాంచ్, ఏటీఎంను ప్రారంభించింది.

ఈ నూతన బ్రాంచ్‌ను ప్రముఖ పారిశ్రామికవేత్త ఎన్. అఖిలేష్ రెడ్డి, బ్రాంచ్ ప్రాంగణంలోని ఏటీఎంను హార్టికల్చర్ (కేవీకే ఐసీఏఆర్ భారత ప్రభుత్వం) మాజీ శాస్త్రవేత్త డాక్టర్ సదానందం దాసరి, ఆన్‌సైట్ స్ట్రాంగ్ రూమ్‌ను భవన యజమాని ఉట్ల కృష్ణ ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి సౌత్ ఇండియన్ బ్యాంక్ ఇండిపెండెంట్ డైరెక్టర్ లక్ష్మి రామకృష్ణ శ్రీనివాస్, బ్యాంక్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాగా హైదరాబాద్ వెస్ట్రన్ కారిడార్‌లోని వ్యూహాత్మక ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ బ్రాంచ్.. శరవేగంగా విస్తరిస్తున్న గచ్ఛిబౌలి, కొండాపూర్ పరిసర ప్రాంతాల రిటైల్ కస్టమర్లు, ఎంఎస్‌ఎంఈ లు, నూతన పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థలు, స్థానిక నివాసితుల బ్యాంకింగ్ అవసరాలను తీర్చడానికి కస్టమర్-సెంట్రిక్ విధానంతో పూర్తి స్థాయి బ్యాంకింగ్ ఉత్పత్తులు, సేవలను ఈ బ్రాంచ్ అందించనుంది.