ఉత్సాహంగా ‘మేరుత్సవ్ 2026’
- మేరు ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఘనంగా నిర్వహణ
- 75కు పైగా స్కూళ్ల నుంచి ఆరువేల మంది విద్యార్థుల భాగస్వామ్యం
హైదరాబాద్, జూలై 31(విజయక్రాంతి) : మేరు ఇంటర్నేషనల్ స్కూల్ తమ మియాపూర్ క్యాంపస్‌లో శుక్రవారం హైదరాబాద్ లోనే అతిపెద్ద ఇంటర్‌స్కూల్ సాంస్కృతిక, విద్యా కీడోత్సవం ‘మేరుత్సవ్ 2026’ 6వ ఎడిషన్‌ను అత్యంత వైభవంగా నిర్వహించిం ది. ఈ బృహత్తర కార్యక్రమంలో నగరంలోని 75కి పైగా పాఠశాలల నుంచి ఆరువేల మందికి పైగా విద్యార్థులు పాల్గొని, తమ ప్ర తిభను, సృజనాత్మకతను, నాయకత్వ లక్షణాలను, క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించారు.
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు అకడమిక్స్, క్రీడలు, సంస్కృతి, పెర్ఫా ర్మింగ్ ఆరట్స్, సాహిత్యం, రోబోటిక్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ వంటి విభాగాల్లో 85కి పైగా పోటీలను నిర్వహించారు. సంగీతం, నృత్యం, గానం, గిటార్ ప్రదర్శనలు, ఆర్ట్ ఎగ్జిబిషన్లు, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రదర్శనలు, సాహిత్య కార్యక్రమాలు,క్రీడా పోటీలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
మేరు ఇంటర్నేషనల్ స్కూల్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ మేఘ న గొరుకంటి జూపల్లి మాట్లాడుతూ ‘మేరుత్సవ్ కేవలం ఒక పోటీగా మాత్రమే కా కుం డా, యువతలోని ప్రతిభ, జిజ్ఞాస, సృజనాత్మకత, ఐక్యతను వేడుక చేసుకునే ఒక గొప్ప వేదికగా మారింది. ఈ వేదికపైకి వచ్చి పోటీపడిన ప్రతి విద్యార్థి తమలో ఆత్మవి శ్వాసాన్ని, నాయకత్వ లక్షణాలను పెంపొందిం చుకుంటారు.






