1 August, 2026 | 3:59 AM

బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాగు ముదిరాజ్

01-08-2026 01:59 AM

గజ్వేల్, జులై 31:  బీజేపీ ఓబీసీ మోర్చా సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాగు ముదిరాజ్ను పార్టీ అధిష్ఠానం నియమించింది. ఈ సందర్భంగా నాగు ముదిరాజ్ మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి ఈ కీలక బాధ్యతను అప్పగించిన  పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని, పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేస్తూ సంస్థ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని నాగు ముదిరాజ్ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు  రామచంద్ర రావు, ఎంపీ ఎం. రఘునందన్ రావు, సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు  మల్లన్న బిక్షపతి, ఆయా మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.