శానిటరీ ప్యాడ్ల సొమ్ము మాయం
స్కాలర్‌షిప్ నిధులను దారి మళ్లించిన రేవంత్ సర్కార్
టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
డాక్టర్ భిక్షపతి తొలి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటన
జనగామ, జూలై 31 (విజయక్రాంతి): జనగామ జిల్లా కేంద్రంలోనీ జూబ్లీ ఫంక్షన్ హాల్ లో జిల్లా అధ్యక్షుడు కట్ల సదానందం, యూ త్ ప్రెసిడెంట్ పిట్టల సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ బహుజన విద్యార్థి యువ చైతన్య సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ)అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తన శైలిలో అధికార, ప్రతిపక్ష పార్టీలపై నిప్పులు చెరిగారు. విద్యార్థుల సమస్యలు, పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యా వ్యాపారం చేస్తు న్న రాజకీయ నేతల తీరుపై మల్లన్న మండిపడ్డారు.
గత కేసీఆర్ ప్రభుత్వం తొమ్మిది, ప దో తరగతి చదువుతున్న ఆడబిడ్డల కోసం ప్రవేశపెట్టిన శానిటైజేషన్ స్కీమ్ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం అటకెక్కించిందని ఆరోపించారు శానిటరీ ప్యాడ్ల కోసం కేటాయించి న రూ.74 కోట్లను దొంగతనంగా ఎత్తుకపో యి తిన్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు అందాల్సిన 1900 కోట్ల రూపాయల స్కాలర్‌షిప్ నిధులలో కేవలం 300 కోట్లు మాత్రమే విడుదల చేసి, మిగిలిన సొమ్మును రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇతర పనులకు దారి మళ్లించిందని మల్లన్న ఆరోపించారు.
శ్రీ చైతన్య, నారాయణ వంటి విద్యా సంస్థలు ఇతర రాష్ట్రాల విద్యార్థుల ర్యాంకులను తమవిగా చూపించుకుంటూ తప్పుదోవ పట్టించే ప్రకటనలతో తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.’ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009’ ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు దక్కాల్సిన 25% ఉచిత సీట్ల గురించి ప్రభుత్వం ప్రజలకు చెప్పడం లేదని, ఆ చట్టాన్ని అమ లు చేయడం లేదన్నారు. జనగామ నియోజకవర్గంలో రాజకీయం విద్యా వ్యాపారవేత్తల చేతుల్లో బందీ అయిందని మల్లన్న విమర్శించారు.
ఒకవైపు అనురాగ్ యూనివర్సిటీ య జమాని పల్లా రాజేశ్వర్ రెడ్డి, మరోవైపు కొ మ్మూరి ఇనిస్టిట్యూట్ అధినేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి విద్యను అమ్ముకుంటూ కోట్ల రూపాయలు గడిస్తున్నారని ధ్వజమెత్తారు. కాగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరపున జనగామ నియోజకవర్గ మొట్టమొదటి ఎ మ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ భిక్షపతిని తీన్మార్ మల్లన్న అధికారికంగా ప్రకటించారు.సమావేశం అనంతరం తీన్మార్ మల్లన్న స్థానిక 5, 13వ వార్డుల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్లబోయిన ఓదెలు యాదవ్, మహిళా అ ధ్యక్షురాలు పటేల్ వనజ,క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందారపు నర్సయ్య గౌడ్,మహిళా క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ పుష్ప లీలా,మైనారిటీ అధ్యక్షులు సల్మాన్,యూత్ అధ్యక్షులు చంద్రశేఖర్,కార్యదర్శి ప్రవీణ్ రాజ్,సహాయ క కార్యదర్శి గిరగాని భిక్షపతి గౌడ్,యూత్ జనరల్ సెక్రటరీలు వీరమల్లు అనిల్,పోలు రాజు , మహిళా ఉపాధ్యక్షురాలు చేసుకూరి మౌనిక యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






