1 August, 2026 | 1:55 AM

పెట్టుబడులు పెట్టండి

01-08-2026 01:08 AM
  1. పారిశ్రామిక ప్రగతికి రాష్ట్రం అనువైనది  
  2. పీవీ హయాంలో గణనీయమైన సంస్కరణలు
  3. ఆ ఫలితాలనే నేడు అనుభవిస్తున్నాం 
  4. చంద్రబాబు కృషితోనే హైదరాబాద్‌కు గుర్తింపు
  5. బిల్‌గేట్స్, బిల్‌క్లింటన్‌ను తీసుకువచ్చి పెట్టుబడులను ఆకర్షించారు 
  6. బీఆర్‌ఎస్ తెచ్చిన పాలసీలను కూడా కొనసాగిస్తున్నాం 
  7. సీఐఐ ఉత్తర భారత ప్రతినిధుల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి) : పెట్టుబడులకు తెలంగాణ అత్యంత సురక్షితమైన స్థానమని.. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధికి అనుకూల వాతావరణం, స్థిరమైన విధనాలు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఉత్తర భారత ప్రతినిధులను ఆహ్వానిం చారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం పూర్తి సహకారం, రక్షణ కల్పిస్తుందని హామీ ఇచ్చా రు.

సీఐఐ ఉత్తర భారత ప్రతినిధులు శుక్రవారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం మా ట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్లుగా విజయవంతం గా కొనసాగుతున్నట్లే, సీఐఐ కూడా 130 ఏళ్లుగా పారిశ్రామిక రంగ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకువచ్చిన సరళీకరణ, ప్రైవేటీకర ణ, ప్రపంచీకరణ (ఎల్‌పీజీ ) ఫలితాలను దేశం ప్రస్తుతం అనుభవిస్తుందన్నారు.

ప్రభుత్వాలు మారినా తెలంగాణలో పారిశ్రామిక విధానాల్లో స్థిరత్వం కొనసాగుతుందన్నారు. 1994 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయు డు అనేక పెట్టుబడులను ఆకర్షించారని.. బిల్ గేట్స్, బిల్ క్లింటన్ లాంటి దిగ్గజాలను హైదరాబాద్‌కు తీసుకువచ్చారని సీఎం గుర్తు చేశారు. 2004 వరకు కాంగ్రె స్ పాలనలో అంతర్జాతీయ విమానాశ్రమం, ఔటర్ రింగ్ రోడ్డు, ఫార్మా, ఐటీ కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చాయన్నారు.

2014 2023 వరకు బీఆర్‌ఎస్ పాలనలో వాళ్లు కొన్ని పాలసీలు తీసుకువచ్చారని, వాటిని కొనసాగిస్తూనే తాము కొత్త విధనాలు తీసుకువచ్చామని తెలిపారు. రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్ లేదని, నాయకులు ఎవరైనా, పార్టీ ఏదైనా మంచి పాలసీ తీసుకువస్తే అది కొనసాగుతుందని స్పష్టం చేశారు. తాము తీసుకువచ్చిన పారిశ్రామిక విధానాలతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని, మంచి ప్రతిపాదనలతో వచ్చిన వారికి ప్రోత్సాహాకాలు ఇస్తున్నామని సీఎం తెలిపారు. 

ఫార్చ్యూన్ కంపెనీలు ఫ్యూచర్ సిటీకి రావాలి

ఫార్చ్యూన్ గ్రూప్‌నకు చెందిన 500 కంపెనీలు భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలనేది తమ ఆకాంక్ష అని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఫ్యూచర్ సిటీలో డిసెంబర్‌లో గ్లోబల్ సమ్మిట్ ఏర్పా టు చేశామని, సమ్మిట్‌లో175 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారని వివరించారు. తెలం గాణ రైజింగ్  పాలసీని గ్లోబల్ స మ్మిట్‌లో ప్రకటించామని తెలిపారు. ప్రస్తు తం దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5 శా తంగా ఉందని, అది10 శాతంగా ఉండాలన్నదే తన లక్ష్యమని సీఎం వెల్లడించారు.

కాలుష్యంతో ఢిల్లీ, వర్షాలతో ముంబై, ట్రాఫిక్‌తో బెంగళూరు, ప్రకృతి వైపరీత్యాలతో చెన్నై సతమవుతున్నాయని, ఈ నేపథ్యంలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్గా విభజించామని సీఎం తెలిపారు. 160 కి.మీ పొడవైన ఔటర్ రింగు రోడ్డు లోపల ప్రాంతాన్ని క్యూర్‌గా గుర్తించామని, ఇక్కడ సర్వీస్ సెక్టార్‌కు పెద్ద పీట వేస్తున్నామని వివరించారు.

ఔటర్ నుంచి రీజినల్ రింగు రోడ్డు వరకు ప్రాంతాన్ని ప్యూర్‌గా గుర్తించామని, అక్కడ మాన్యుఫ్యాక్చర్ రంగానికి, రీజినల్ రింగు రోడ్డు వెలుపల వ్యవసాయం, అగ్రి పరిశ్రమలకు ప్రాధాన్యమివ్వనున్నట్లు వెల్లడించారు. ప్యూర్, రేర్ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటు కు అవసరమైన భూములు ఇవ్వడంతో పాటు వసతులు కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి వారికి హామీ ఇచ్చారు.

ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం పోర్టుకు 12 లేన్ల రోడ్డు

భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీప ట్నం పోర్టు వరకు 12 లేన్ల రహదారి నిర్మించనున్నామని, విభాగాల వారీగా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని సీఎం వివరించారు. వరంగల్, ఆదిలాబాద్‌లో ఎయిర్ పోర్టుల నిర్మాణాలకు కేంద్రం నుంచి అనుమతి తెలిపిందని, దేశంలో ఏడు బుల్లెట్ ట్రైన్లను కేంద్రం మంజూరు చేస్తే, అందులో 3 తెలంగాణకు వచ్చాయన్నారు. శంషాబాద్ శంషాబాద్ శంషాబాద్ బుల్లెట్ ట్రైన్లు రాబోతున్నాయన్నారు.

పొరుగు రాష్ట్రాలతో పోటీ పడదల్చుకోలేదని, ప్రపంచంలోని ఇతర దేశాలతో పోటీ పడి చైనాను మించి తెలంగాణను నిలపడమే తన లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొ న్నారు. 2037 నాటికి వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు. తెలంగాణ సంస్కృతి తమకు పెద్ద ఆస్తి అని, హైదరాబాద్‌లో  అన్ని రాష్ట్రాల ప్రజలున్నారని, ఇక్కడ పెట్టుబడులు పెడితే దానికి రెట్టింపు ఆదాయం వస్తుందన్నారు. తెలంగాణను మీ సొంత ప్రాంతంగా భావించాలని సీఐఐ ప్రతినిధులకు ముఖ్యమంత్రి సూచిం చారు. 

డిమాండ్ ఉన్న కోర్సులకే ప్రాధాన్యం 

మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కోర్సులనే బోధిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఏఐ సునామీతో వైట్‌కాలర్ జాబ్‌లు పోతున్నాయని, దాంతో తాము నైపుణ్యాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించినట్లు వెల్లడించా రు. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నెలకొల్పామని, దానికి ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా, డైరెక్టర్లుగా కార్పొరేట్ కంపెనీల దిగ్గజాలు ఉన్నారని, దేశంలోనే తమది బెస్ట్ స్కిల్ యూనివర్సిటీ అని పేర్కొన్నారు.

ఐటీఐలను ఏటీసీలుగా మార్చుతున్నామని, అందులో శిక్షణ పొందిన వారికి 100 శాతం ఉద్యోగాలు వచ్చాయని వెల్లడించారు. ఇక్కడి జీసీ సీల్లో  200 కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయని, అమెజాన్ డేటా సెంటర్లపైన రూ.లక్ష కోట్ల పెట్టుబడి పెడుతోందని, అదాన్ రూ.35 వేల కోట్లు డేటా సెంటర్ పైన పెట్టుబడి పెడుతోందని సీఎం తెలిపారు.

సమావేశంలో సీఎం సలహాదారు రామకృష్ణారావు, పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య, సీఐఐ  నార్తరన్ రీజియన్ వైస్ ఛైర్మన్ శారదా సూరి మార్వా, ప్రతినిధులు కృష్ణ బోధనపు, గౌరవ్ మహేశ్వరి, వనిత దాట్ల, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వినోద్ కె బాప్న తదితరులు పాల్గొన్నారు.

 తెలంగాణ పారిశ్రామిక విధానాలు భేష్

తెలంగాణ పారిశ్రామిక విధానాలు చాలా బాగున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాకాలు, ఇస్తున్న మద్దతుతో జీసీసీలు హైదరాబాద్‌కు వరుస కడుతున్నాయి. పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం ఇక్కడ ఉంది. మౌలిక వసతులు, ప్రభుత్వ సహాయ సహకారాలు మెరుగ్గా ఉండడంతోనే సమావేశానికి హైదరాబాద్‌ను ఎంచుకున్నాం. ఇక్కడ అధ్యయనం చేసేం దుకు వచ్చాం.   

  పునీత్‌కౌరా, చైర్మన్, 

సీఐఐ నార్తరన్ రీజియన్