ఏసీబీకి చిక్కిన ఎస్‌ఐ
- రూ.లక్ష డిమాండ్ చేసిన నిందితుడు
- స్టేషన్ బెయిల్ ఇప్పిస్తానని ఒకరికి హామీ
- పీఎస్, ఎస్‌ఐ నివాసంలో ఏసీబీ సోదాలు
- గాంధీనగర్ పోలీస్ పరిధిలో ఘటన
ముషీరాబాద్, జూన్ 23(విజయక్రాంతి): స్టేషన్ బెయిల్ ఇప్పించడంతో పాటు భవిష్యత్తులో వేధించకుం డా ఉండాలంటే లక్ష రూపాయలు డిమాండ్ చేసి రూ. 50 వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డా డో ఎస్‌ఐ. సికింద్రాబాద్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. సోద రుల మధ్య గొడవ కారణంగా ఠాకూర్ అనే వ్యక్తిపై పీఎస్‌లో కేసు నమో దైంది.
ఠాకూర్‌కు స్టేషన్ బెయిల్ ఇప్పించడంతో పాటు మున్ముందు ఎటువంటి వేధింపులు ఉండొద్దంటే రూ.లక్ష ఇవ్వాలని ఎస్‌ఐ నర్సింహులు డి మాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఇచ్చిన సమాచారంతో కవాడిగూడ వద్ద రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఎస్‌ఐ నర్సింహులును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని హైదరాబాద్ రేంజ్1 ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీఖాన్ తెలిపారు. నిందితుడు నర్సింహులును అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌తో పాటు, ఆయన నివాసంలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు.






