15 March, 2026 | 6:52 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

అనుమతులు లేని ఇసుక టిప్పర్ పట్టివేత

15-03-2026 03:50 PM

పాపన్నపేట: ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ ను పట్టుకొని ఠాణాకు తరలించినట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మెదక్ వైపు నుంచి బొడ్మట్ పల్లి వైపు ఎలాంటి అనుమతులు లేకుండా టిప్పర్ ఇసుక రవాణా చేస్తుందని నమ్మదగిన సమాచారం రావడంతో ఆదివారం ఉదయం సమయంలో సిబ్బందితో కలిసి వెళ్లి పాపన్నపేట గ్రామ శివారులో ఒక టిప్పర్ ను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.