15 March, 2026 | 6:52 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

పారిశుధ్య కార్మికులే గ్రామ ప్రగతికి వెన్నెముక

15-03-2026 03:53 PM

పెద్దకాపర్తి గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం

చిట్యాల,(విజయక్రాంతి): కార్మికులే గ్రామ ప్రగతికి వెన్నెముక అని, గ్రామం శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండటంలో పారిశుధ్య కార్మికుల శ్రమ వెలకట్టలేనిదని పెద్దకాపర్తి గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం కొనియాడారు. ఆదివారం చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక  99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఆదివారం పెద్దకాపర్తి గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికుల సంక్షేమం, గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు.

సర్పంచ్ మాట్లాడుతూ ​కార్మికులే గ్రామ ప్రగతికి వెన్నెముక అని, గ్రామం శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండటంలో పారిశుధ్య కార్మికుల శ్రమ వెలకట్టలేనిదని ఆయన కొనియాడారు. మేము కోరుకున్న ఆదర్శ గ్రామ పంచాయతీ దిశగా అడుగులు వేయడంలో కార్మికులది కీలక పాత్ర అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులకు హెల్త్ చెకప్ నిర్వహించి, వారిని ఘనంగా సన్మానించారు. వారికి నిత్యావసర వస్తువులైన సబ్బులు, కొబ్బరి నూనె, షాంపూలను పంపిణీ చేశారు. ​

మన ఊరు – మన పరిశుభ్రత గ్రామంలోని ప్రతి ఇల్లు, ప్రతి వీధి అద్దంలా మెరవాలని సర్పంచ్ ఆకాంక్షించారు. పరిశుభ్రత అనేది కేవలం కార్మికుల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి గ్రామస్థుడి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు.​ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ​ఓర్సు సైదులు ​ఎర్పుల యాదయ్య, నీలకంఠం విజయ, ​నీలకంఠం లింగస్వామి, ​మర్రి గోపాల్ రెడ్డి, సాగర్ల నాగరాజు, అనగంటి నరేష్, ఆశా వర్కర్లు మరియుగ్రామానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు మరియు నాయకులు పాల్గొన్నారు.