23 May, 2026 | 3:18 AM

వరి, మొక్కజొన్న కొనుగోలు వేగవంతం చేయాలి

23-05-2026 02:12 AM
  1. రైస్ మిల్లుల వద్ద తగినంత హమాలీలను ఏర్పాటు చేయాలి 
  2. లారీలను అన్లోడ్ త్వరగా చేపించాలి 
  3. సమీక్ష సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డి 

కామారెడ్డి, మే 22 (విజయక్రాంతి): వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్లో దాన్యం, మొక్కజొన్న, జొన్న పంటల పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధాన్యం అమ్మకంలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని రైతుల తన దృష్టికి తెచ్చారని చెప్పారు. రైతులు ఇబ్బందులు పడకుండా తగినంత హామాలీలను ఏర్పాటు చేయాలని, రైస్ మిల్లు వద్ద లారీలను అన్లోడ్ త్వరగా చేయించాలని కోరారు.

వర్షాలకు తడిచిన ధాన్యాన్ని రైస్ మిల్లర్ ల్లు కొనే విధంగా అధికారులు చూడాలని అన్నారు. ప్రతి రైస్ మిల్లు ప్రతిరోజు 15 లారీల ధాన్యాన్ని అన్లోడ్ చేయాలని సూచించారు. కామారెడ్డి నియోజకవర్గంలో ప్రస్తుతం 70000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. 65 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రైస్ మిల్లులకు తరలించడం జరిగింది అన్నారు. మరో 25 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు.

మొక్కజొన్న 1471 మెట్రిక్ టన్నుల కొనుగోలు చేయడం జరిగిందన్నారు. 1231 మెట్రిక్ టన్నులను తరలించడం జరిగిందన్నారు. 239 మెట్రిక్ టన్నులు తరలించాల్సి ఉందన్నారు. సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్లు, ఆదేశాలను పగడ్బందీగా అమలు చేయాలని సూచించారు.

వర్షాకాలం ప్రారంభం కానున్నందున కొనుగోలు జూన్ 5 వరకు పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా సివిల్ సప్లై అధికారులు వెంకటేశ్వర్లు, సివిల్ సప్లై మేనేజర్ శ్రీకాంత్, డి ఎం ఏ, వ్యవసాయ శాఖ అధికారులు, పిఎసిఎస్ మానిటరింగ్ అధికారులు, ఐకెపి ప్రతినిధులు, మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.