ఏ శిక్షకైనా సిద్ధం
- 80 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయా?.. నిరూపించండి
- ప్రభుత్వానికి బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ సవాల్
- సీఎం, మంత్రుల లెక్కలు అవాస్తవాలు
- శ్వేతపత్రం ఇవ్వండి
- రైతు సమస్యలే ఎజెండాగా క్యాబినెట్ సమావేశం నిర్వహించాలి: కేటీఆర్
హైదరాబాద్, మే 22 (విజయక్రాంతి) : రాష్ట్రంలో పంట కొనుగోళ్లకు సంబంధించిన అంశంలో ముఖ్యమంత్రే మో ‘80 శాతం పంట కొనుగోళ్లు పూర్తయ్యాయి’ అని, మంత్రులేమో ’50 శాతం పూర్తయ్యాయి’ అని అడ్డగోలు ప్రకటనలు చేస్తున్నారని, కానీ క్షేత్రస్థాయి లో మాత్రం కనీసం 30 శాతం కొనుగోళ్లు కూడా పూర్తికాలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి చెప్పినట్లు ఎక్కడైనా 80 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని నిరూపిస్తే ఏ శిక్షకైనా తాము సిద్ధమని ముఖ్యమంత్రికి కేటీఆర్ సవాల్ విసిరారు.
రాష్ట్రంలోని అన్నదాతల పరిస్థితి పైన, పంట కొనుగోళ్ల సంక్షోభం పైన శుక్రవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయ న మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా చేసిన పంట కొనుగోళ్ల పైన, పం టల వారీగా లెక్కలతో కూడిన శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పదేళ్లు దేశానికి అన్నపూర్ణగా వెలుగొందిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు రైతన్నల కన్నీళ్లతో తల్లడిల్లుతున్నదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూరియా దొరకదు, రైతుబంధు దొరకదు, రుణమాఫీ దొరకదు.. చివరికి పండిం చిన పంట అమ్ముకుందామంటే కూడా సౌకర్యాలు దొరకని పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. ప్రభుత్వం పంట కొనుగోళ్ళను ఆలస్యం చేస్తే ఎవరో ఒక బ్రోకర్‌కి రైతులు తోచిన ధరకి అమ్ముకుంటారు అన్న ప్రభుత్వ పాలసీ స్పష్టంగా కనిపిస్తున్నదన్నారు.
ఇప్పటికైనా ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు బుకాయింపులు, బెదిరింపులు, హుంకరింపులు, అబద్ధాలతో కాలం నెట్టుకురాకుండా ఉన్న సంక్షోభాన్ని గుర్తించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందే నిజమైతే, మా పార్టీ తరఫున ఏ కొనుగోలు కేంద్రానికైనా వస్తామని, క్షేత్రస్థాయి సమస్యలు తెలుసుకుందామన్నారు. బోనస్ ఎగ్గొట్టడం కాదని, ఈ ప్రభుత్వమే పెద్ద బోగస్ అన్నారు.
వరంగల్ డిక్లరేషన్‌లో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, రైతు బంధు ఇవ్వకుండా ఉండటానికి మేం ఏమన్నా దివానా గాళ్లమా అన్నారని, ఆ మాటలను తాను గుర్తుచేస్తే విమర్శిస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకు విజయవంతంగా ఈ ప్రభుత్వం నాలుగోసారి రైతు బంధును ఎగ్గొట్టిందన్నారు. రాష్ట్రంలో పంట కొనుగోళ్ళ సంక్షోభం తీవ్రంగా ఉన్నదని, దీన్ని పట్టించుకోకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులంతా అవాస్తవాలు చెప్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో స్వయంగా పర్యటించిన తాను, కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న రైతన్నల దుస్థితిని చూసిన తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఒక బహిరంగ లేఖ రాశానని, అది చూశాకనైనా ధా న్యం కొనుగోళ్లపై సమీక్షిస్తారని ఆశించామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డికి డబ్బు సంచుల మీద దృష్టిలో కొంతైనా ధాన్యం సంచులపై పెడతారనుకున్నామని, కానీ ఇటీవల సీఎం ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన తీరు చూస్తే ఆశ్చర్యంతోపాటు బాధ కూడా కలిగిందన్నారు.
సీఎం తో పాటు మంత్రి అబద్ధాలు, అటెన్షన్ డైవర్షన్ ముచ్చట్లు చెప్పారని మండిపడ్డారు. అన్న దాతల ఆత్మహత్యల పైన, మరణాల పైన ప్ర భుత్వానికి సమాచారం ఇస్తే.. సివిల్ సప్లైస్ మంత్రితో పాటు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత దు ర్మార్గంగా ’ఎవరూ చనిపోలేదు’ అని బుకాయిస్తుందన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సొం త జిల్లాలోని నకిరేకల్ నియోజకవర్గంలో నజీరుద్దీన్ అనే రైతు ధాన్యం కుప్పల వద్ద మృతి చెందడం వాస్తవంకాదా అని ప్రశ్నించారు.
ధా న్యం కాంటా పెట్టడంలేదని కాంగ్రెస్ కార్యకర్త పొన్నాల తిరుమలేష్ అర్థనగ్నంగా నిరసన తె లిపిన పరిస్థితి ఉందన్నారు. సీఎం సొంత ని యోజకవర్గంలోనూ రైతులు రోడ్డిక్కి నిరసన తెలియజేశారని తెలిపారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో 10 మంది రైతులు చనిపోతే.. ఎవరూ చనిపోలేదని మంత్రులు అంటున్నారని, ఇంతకంటే సిగ్గుచేటు లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు స్వచ్ఛందంగా రోడ్లెక్కి ఆం దోళనలు చేస్తున్నారని, ధర్నాలు చేస్తున్నారని కేటీఆర్ తెలిపారు.
ఆరుగాలం పండించి తీసుకువచ్చిన పంటను కొనుగోలు కేంద్రాలకి తర లిస్తే.. కనీసం వాటిని కాంటా పెట్టడం లేదు. కాంటా పెట్టిన సందర్భంలోనూ భారీగా తరుగుతీసి దోపిడీకి గురిచేస్తున్నదని కేటీఆర్ మం డిపడ్డారు. రాష్ట్రంలో గన్నీ బ్యాగులు దొరకడం లే దు కానీ గన్నులు మాత్రం విచ్చలవిడిగా దొరుకుతున్నాయని, ఈ మధ్య జరిగిన దాడులను, అరాచకాలను కేటీఆర్ ప్రస్తావించారు.
రైతులకు ఇక్కట్లు తప్పవు..
కేంద్ర ప్రభుత్వం ఏమైనా చేస్తుందా అంటే, ఇటీవల ప్రధాని మోదీ చావుకబురు చల్లగా చెప్పివెళ్లారని అన్నారు. రైతులు యూరియా వాడటం ఆపాలని సుద్దులు చెప్పడాన్ని బట్టి వచ్చే సీజన్‌లో కూడా యూరియా కొరత తప్పదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నంతకాలం యూరియా దొరకదు.. రైతులకు ఇక్కట్లు తప్పవని స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డికి భూ దోపిడీ, భూముల దందాపై ఉన్న శ్రద్ధ భూమిని నమ్ముకున్న రైతులపైన లేదని మండిపడ్డారు.
రాష్ట్రంలో 1.50 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే ప్రభుత్వం కొనుగో లు చేసిందెంతో లెక్కలు బయట పెట్టాలని డి మాండ్ చేశారు. ఈ సీజన్‌లో పది మంది రైతులే కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రా ష్ట్రంలో వెయ్యి మంది రైతులు చనిపోయారని తెలిపారు. వారందరిని మరణాన్ని ప్రభుత్వ హత్యలుగా గుర్తించి, వారి కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డి మాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైతే పంట కొనుగోళ్ళు ఆలస్యమై, నష్టపోయి న రైతన్నలు మరణాల పాలయ్యారని, వారి వివరాలను ప్రభుత్వానికి అందజేస్తామన్నా రు. ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్ ఇస్తున్న సమాచారాన్ని, సలహాలను తీసుకొని పంట కొనుగో లు సంక్షోభాన్ని గుర్తించాలని, మొద్దు నిద్ర నుంచి మేల్కోవాలని కేటీఆర్ అన్నారు. ‘కేవలం అధికారంలో ఉన్నాము కాబట్టి కింద ఉ న్న సమస్యను పట్టించుకోము, ఎవరు చెప్పి నా వినము’ అనే మూర్ఖత్వంతో వ్యవహరించవద్దని కేటీఆర్ సూచించారు.
కనీసం నేడు జరి గే క్యాబినెట్ సమావేశంలోనైనా అత్యంత కీలకమైన ఈ పంట కొనుగోళ్ళ సంక్షోభం పైన చర్చించాలని, రైతన్నల కష్టాలే ఏకైక ఎజెండాగా క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలను పట్టించుకోకుంటే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువ స్తామని, ఎక్కడికక్కడ నిలదీస్తూనే ఉంటామని కేటీఆర్ హెచ్చరించారు.
న్యాయ వ్యవస్థ వల్లే బాలికకు న్యాయం..
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసులు పనికిమాలినోళ్లు అయ్యారా అని ప్ర శ్నించారు. తెలంగాణలో శాంతిభద్రతలు పూ ర్తిగా దిగజారిపోయిన పరిస్థితి ఉందన్నారు. ఇదంతా చూసిన తర్వాత రాష్ట్రం లో ఏ ఆడబిడ్డ కూడా బలవంతులపైన ఫిర్యాదు చేయ డానికి వెనకాడే పరిస్థితి నెలకొందన్నారు. ఈ మొత్తం కేసులో మా పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అద్భుతంగా ప్రభుత్వాన్ని, మీడియాను అలర్ట్ చేస్తూ ముం దుకు పోయేలా చేశారని అభినందించారు.
అలాంటి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ గురించి సీఎం రేవంత్‌రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, కానీ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆయ నకు పాఠం చెప్పే రోజు వస్తుందన్నారు. రేవంత్‌రెడ్డిని పట్టుకున్న పోలీసోళ్లకే దొంగలను ఎలా పట్టుకోవాలో చెప్పినట్టు వార్తలు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఈయన కూడా చెప్పే టోడు అయిపోయిండని పోలీసులు నవ్వుకుంటున్నారని తెలిపారు. కేంద్ర మంత్రులు, కేం ద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, సీఎం, మీడి యా వ్యవస్థలన్నీ మౌనం వహించినా కేవలం న్యాయ వ్యవస్థ వల్ల బాలికకు న్యాయం జరిగిందన్నారు.
ఈ విషయంలో రాజకీయం చేయబోమని, కానీ రాష్ట్రంలో ఎక్కడ ఆడబిడ్డలకు అన్యాయం జరిగినా కొట్లాడింది తామేన ని, లగచర్ల మొదలుకుని అనేక అంశాల్లో పార్టీ తరపున కొట్లాడుతున్నామని తెలిపారు. పో క్సో కేసు విషయంలో హనీ ట్రాప్ అన్న వారి ని బయటపెట్టాలని, అందులో బీఆర్‌ఎస్ వాళ్లు ఉన్నా వదిలిపెట్టవద్దని సవాల్ చేశారు. నా బావమరిది ఇంట్లో డ్రగ్స్ దొరికాయని అబద్ధాలు మాట్లాడటానికి సీఎంకు సిగ్గుందా అని విమర్శించారు.
అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలి
రేవంత్‌రెడ్డి మొఖం చూసి ఎవరూ ఓటు వేయలేదని, అడ్డిమారి గుడ్డి దెబ్బలో, పే మెంట్, మేనేజ్‌మెంట్ కోటాలో సీఎం అయ్యారని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి గొప్ప నాయ కుడైతే మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానాన్ని, ఆ పరిధిలోని ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా ఎందుకు గెలిపించలేకపోయారని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడ ఎన్నికలైనా తెలంగాణ నుంచే డబ్బు పోతుందని అందరికీ తెలుసని, అయినా నీకు, బీజేపీకి ఫెవికాల్ బంధం ఉంది కా బట్టి వాళ్లు రేవంత్‌రెడ్డిని పట్టుకోరని చెప్పారు.
నిజంగా 2034 వరకు సీఎంగా ఉంటారనే ధైర్యం రేవంత్‌రెడ్డికి ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలని, ప్రజలే తీర్పు ఇస్తారని సవాల్ విసిరారు. సీఎం రెడీగా ఉంటే రాజీనామా చేసేందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలం దరం సిద్ధమే అన్నారు. మీ పరిపాలన అద్భుతంగా ఉందనే ధీమా ఉంటే మా పార్టీ నుంచి గుంజుకున్న 9 మందితో అయినా రాజీనామా చేయించాలన్నారు.
నిందితున్ని కాపాడిన వెదవ ఎవరు..?
రాష్ట్ర సీఎం, కేంద్ర మంత్రి ఇద్దరూ తో డు దొంగలేనని ఆరోపించారు. మైనర్ బాలి క తనకు అన్యాయం జరిగిందని తల్లిదండ్రులతో పోలీస్ స్టేషన్‌కు వెళ్తే అర్థరాత్రి వరకు నిలబెట్టి తీవ్ర ఆవేదనకు గురి చేసింది రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని బయటకు వస్తే ఆ కుటుంబాన్ని బెదిరించి కౌంటర్ కేసు పెట్టించి, నిందితుడికి తొమ్మిది రోజులు రాచ మర్యాదలు చేసి కాపాడిన వెదవ ఎవడని నిలదీశారు.
ప్రధాని బందోబస్త్‌లో బిజీగా ఉన్నామని, అందుకే కేసు పెట్టలేదని చెప్పడానికి డీజీపీ తలకాయ ఉందా అని మండి పడ్డారు. ప్రధాని రాష్ట్రానికి వస్తే పోలీసులు హాలీడే ఇస్తారా, ఇష్టం వచ్చినట్టు చంపుకోమని నేరస్థులకు, రేవంత్‌రెడ్డి చంచల్ గూడ బ్యాచ్‌కు చెలరేగమని చెప్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు ఉం దా అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి మెదడు ఉండా, లేకపోతే వడదెబ్బకు చిన్న మెదడు చితికి పోయిందా అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
అత్యంత సున్నితమైన బాలిక విషయంలో పార్టీ తరపున మౌనంగా ఉన్నామ ని, ఏనాడూ రాజకీయం చేయలేదని తెలిపారు. కానీ సీఎం మాపైన విమర్శలు చేసిన తర్వాత తప్పని పరిస్థితుల్లో ఈ అంశంపైన మాట్లాడాల్సి వస్తుందన్నారు. ఒక పోక్సో కేసు నిందితుడిని తొమ్మిది రోజులు దాచిపెట్టిన సందర్భం దేశంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. కేవలం కేంద్రమంత్రికి, సీఎంకు ఉన్న అనుబంధం వల్లనే ఇద్దరూ కలిసి నిందితుణ్ణి తొమ్మిది రోజులు దాచి పెట్టారని ఆరోపించారు.
సీఎం సన్నిహితుడి ఆస్పత్రిలో దాచిపెట్టారన్న వార్తలు వస్తున్నాయని, దీనిపైన ప్రభుత్వం విచారణ చేయా లన్నారు. నిందితునికి సంబంధించి వార్తలు రాకుండా మేనేజ్ చేసిందెవరని అన్నారు. నిందితుడు సామాన్యుడు అయితే పోలీసు లు ఊరుకునే వారా, నిందితుని తల్లిదండ్రులను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్‌లో కూర్చొబె ట్టరా అని నిలదీశారు. కేంద్ర మంత్రి కొడు కు కాబట్టి నిందితునికి మినహాయింపు ఇ చ్చారా, సీఎం రేవంత్‌రెడ్డి దోస్త్ కాబట్టి ఊ రుకున్నారా అని ప్రశ్నించారు.
ఈ విషయం లో హైకోర్టుకు సెల్యూట్ చేస్తున్నానని చె ప్పారు. ప్రభుత్వం తీరుపై రాష్ట్రంలో మహిళలందరూ ఉమ్మి వేస్తున్నారని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి ఎత్తే తక్కువ అనుకున్నానని, కానీ బుర్ర కూడా తక్కువే ఉందని ఎద్దేవా చేశారు. బాధితురాలికి సంబంధించిన వివరాలు బయట పెట్టిన వెదవలు ఎవరని ప్ర శ్నించారు. ఇంకా మాట్లాడానికి సీఎం రేవంత్‌రెడ్డికి సిగ్గు, ఇజ్జత్ ఉందా అని నిలదీశారు. సీఎం, కేంద్రమంత్రి సుద్దపూసల్లాగా, సత్య హరిశ్చంద్రుని కజిన్ బ్రదర్స్ లాగా వెదవ యాక్టింగ్‌లు, దానికి ప్రమోషన్లు అని ఆగ్ర హం వ్యక్తంచేశారు.
హరీశ్‌రావు కరెక్ట్‌గానే చెప్పారు
ఫార్మాసిటీపై హరీశ్‌రావు కరెక్ట్‌గానే చెప్పారని, అది ఫార్మాసిటీ కోసం సేకరించిన భూమి అని, దానికి ఫార్మాసిటీ కో సం మాత్రమే వినియోగించాలన్నారు. రేవంత్‌రెడ్డి బీజేపీతో కొత్తగా కలిసిదేముందని, వాళ్లు ఎప్పటినుంచో కలిసే ఉన్నారని తెలిపారు. రెండేళ్ల క్రితం రేవంత్‌రెడ్డి ఆర్‌ఆర్ ట్యాక్స్ వసూల్ చేస్తున్నా రని విమర్శించిన మోడీ ఇప్పుడు రేవంత్‌రెడ్డిని తమతో కలిసి రావాలని పిలుస్తు న్నారంటే దాని అర్థమేంటని ప్రశ్నించా రు. దేశంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రె స్ విఫలమైందని, ఆ పార్టీ కంటే కాక్రోచ్ పార్టీ బెటర్ అనుకుంటున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.






