15 March, 2026 | 5:15 PM

రజాకార్లను తరిమికొట్టిన వీరుడు కామ్రేడ్ బీఎన్ రెడ్డి

15-03-2026 03:47 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి.. మట్టి మనుషులకు పోరు నేర్పిన మహనీయుడు అమరజీవి కామ్రేడ్ భీమి రెడ్డి నరసింహారెడ్డి అని బీఎన్ రెడ్డి శిష్యుడు బిఆర్ఎస్ పార్టీ తుంగతుర్తి మండల కమిటీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. ఆదివారం బీఎన్ రెడ్డి 104 వ వర్ధంతి  సందర్భంగా తుంగతుర్తి మండల కేంద్రంలోని ఆయన స్తూపానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

భూస్వామాలను గడగడ లాడించిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బీఎన్ రెడ్డి అని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో యువత పయనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భీమిరెడ్డి అభిమానులు గుండగాని దుర్గయ్య, తునికి సాయిలు, భైరోజు సోమ నర్సయ్య, పూసపెల్లి యాదగిరి, కోరుకొప్పుల వెంకన్న, ఉప్పల నాగమల్లు, తడకమళ్ళ రవికుమార్, మలుసురు తదితరులు పాల్గొన్నారు.