దోపిడీలకు పాల్పడుతున్న దొంగల ముఠా అరెస్ట్
- నగదు, విదేశీ కరెన్సీ, మొబైల్స్ స్వాధీనం
- కామారెడ్డి పట్టణ సిఐ నరహరి
కామారెడ్డి, మే 22 (విజయక్రాంతి): కామారెడ్డి పట్టణంలో ఓ జులాయ్ గా తిరిగే దొంగల ముఠాను కామారెడ్డి పట్టణ పోలీసులు పట్టుకున్నారు. రాత్రిపూట ఒంటరిగా వెళ్లే వారిని లక్ష్యంగా చేసుకొని దోపిడి కి పాల్పడు తున్న ఐదుగురి ముఠా సభ్యులను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్ కు కు తరలించారు. పట్టణ ఎస్ హెచ్ ఓ నరహరి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఐదుగురు దొంగల ముఠాగా ఏర్పడి ఒంటరిగా వెళ్లేవారు నీ టార్గెట్ గా చేసి దోపిడికి పాల్పడుతున్నారు.
ఈనెల 18న రాత్రి రాజీవ్ నగర్ కాలనీ సమీపంలో ఒంటరిగా ఉన్న ఒక వ్యక్తి నీ అయిదుగురు అడ్డుకొని అతని నీ బెదిరించి దాడి చేసి అతని వద్దనున్న నాలుగు వేల నగదు, ఆధార్ కార్డు, 300 దుబాయ్ దిరంస్, దోచుకెళ్లారు. అంతేకాకుండా బాధితుని మొబైల్ ఫోన్ నుంచి 1000 రూపాయలు యూ పి ఐ ఖాతాకు బదిలీ చేయించు ఉన్నట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు సిఐ తెలిపారు. వీరిని అరెస్టు చేసి వీరి వద్ద నుంచి నగదు, దుబాయ్ కరెన్సీ, ఐఫోన్లు, స్కూటర్ తో పాటు ఇతర వస్తువులను వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్హెచ్‌ఓ నరహరి తెలిపారు. ఈ ముఠాలో ఒక జువె లైన్ నిందితుడు కూడా ఉన్నట్లు తెలిపారు. ఈ కేసును వేగంగా ఛేదించినందుకు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు.






