సరిహద్దు చెకోపోస్టులపై సీపీ ఆకస్మిక తనిఖీలు
23-05-2026 02:10 AM
బోధన్, మే 22(విజయ క్రాంతి): బక్రీద్ పండుగ నేపథ్యంలో మూగజీవాల అక్రమ రవాణా నివారణకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య గురువారం అర్ధరాత్రి కందకుర్తి, జానకంపేట్, పాల్ద జన్నాపల్లి చెకోపోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో 24 గంటల నిఘా కొనసాగించాలని, అనుమానాస్పద వాహనాలు, వస్తువులపై కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టాలని పోలీసు సిబ్బందికి ఆదేశించారు. ప్రజలతో మర్యాదగా ఉంటూ విధులు నిర్వహించాలన్నారు.






