23 May, 2026 | 2:56 AM

16 జిల్లాల్లో 46 డిగ్రీలు

23-05-2026 01:39 AM
  1. మిగతా జిల్లాల్లో 40-45.8 డిగ్రీలు
  2. అత్యధికంగా కొమురంభీం జిల్లాలో 46.5 డిగ్రీలు
  3. అత్యల్పంగా నల్లగొండలో 26.0 డిగ్రీలు
  4. రాష్ట్రంలో ఠారెత్తిపోతున్న ఎండలు, ఉక్కపోత
  5.   27 వరకు రాష్ట్రంలో వడగాల్పులు

హైదరాబాద్, మే 22 (విజయక్రాంతి): భానుడు భగభగ మండుతుండడంతో రా ష్ట్రం అగ్నిగుండంగా మారుతోంది. ఠారెత్తిపోతున్న ఎండలు, పెరుగుతున్న ఉక్కపోతతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. శుక్రవారం 16 జిల్లాల్లో 46 డిగ్రీలు, అత్యధికంగా కొమురంభీం జిల్లాలో 46.5 డిగ్రీలు, అత్యల్పంగా నల్లగొండలో 26.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈనెల 27వరకూ రాష్ట్రంలో వడగా ల్పులు విజృంభించనున్నాయి.

ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటికి వెళ్లొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉష్ణోగ్రతలు అధికంగా నమోద వుతన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉం డాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతేనే మధ్యాహ్నం బయటకు రావాల ని హెచ్చరిస్తున్నారు. అయితే నేడూరేపూ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. శుక్రవారం భానుడు తన ప్రతాపాన్ని చూపించారు.

ఏకంగా 16 జిల్లాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా కొమురం భీం ఆసిఫాబాద్‌జిల్లాలో 46.5డిగ్రీలు నమో దు కాగా, మిగిలిన 15 జిల్లాల్లో 46.2-46.4 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పది జిల్లాల్లో 40.3-45.8 డిగ్రీలు నమోదయ్యాయి. ఏడు జిల్లాల్లో 37.8-39.6 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా నల్లగొండ జిల్లాలో అత్యల్పంగా 26.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

అయితే రాష్ట్రంలో ఈనెల 27 వరకు వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెద్ద మార్పు ఉండదని పేర్కొంది. శనివారం కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని హెచ్చరిం చింది. వేడి రాత్రి పరిస్థితులు భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, రంగారెడ్డి, హైదరా బాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో అక్కడక్కడ ఏర్పడతాయని సూచించింది.

ఆదివారం ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫా బాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వడగా ల్పు లు వీస్తాయని తెలిపింది. అయితే రాష్ట్రంలో వేడి, ఉక్కపోత పెరిగిపోతోంది. దీంతో జనాలు ఇండ్ల నుంచి బయటికి రాకుండా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల కింద కూర్చుంటున్నారు. సాయంత్రం ఐదారైందంటేనే బయ టకు వస్తున్నారు. 

నేడు, రేపు వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ శుక్రవారం సూచించింది. తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. శనివారం, ఆదివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరు ములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.