2 September, 2026 | 1:41 AM

ఆగని బియ్యం అక్రమ రవాణా?

02-09-2026 | 12:00am
  1. పేదల బియ్యం.. అక్రమార్కుల పరం
  2. రెవెన్యూ నిర్లక్ష్యమే రేషన్ బియ్యం దందాకు అండ? 
  3. కిలో బియ్యం రూ 42 భరిస్తున్న ప్రభుత్వం 
  4. లబ్ధిదారుల నుంచి రూ. 15 కె  డీలర్ల కొనుగోలు 
  5. భద్రాచలంలో 600 గంటలు, పాల్వంచలో 310 క్వింటాలు 
  6. టేకుల పల్లెలో 40 క్వింటాలు పట్టుబడిన వైనం. 

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 24, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ ఏదేచ్ఛగా కొనసాగుతోంది. ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో అక్రమంగా రవాణా అవుతున్న రేషన్ బియ్యం పట్టుబడటం అధికారుల వైఫల్యాలను, పర్యవేక్షణ లోపాన్ని తాటి తాళం చేస్తోంది.

ఆగస్టు 15వ తేదీన పాల్వంచలో 300 క్వింటాళ్ల బియ్యం, భద్రాచలంలో రెండు దఫాలుగా 600 క్వింటాల బియ్యం, తాజాగా సోమవారం టేకులపల్లి మండలంలో 40 క్వెంటల రేషన్ బియ్యం పట్టుబడటం సివిల్ సప్లై అధికారుల నిర్లక్ష్యాన్ని తేట తల్లం చేస్తోంది. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక కథనం పేదల ఇంట్లో సన్నబియ్యంతో అన్నం ఉడికించాలన్న ప్రజా ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చిస్తోంది.

జిల్లాలో మూడు నెలలకు సంబంధించిన సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేయడానికి ఏకంగా రూ 78 కోట్లు ఖర్చు చేస్తూ ప్రతి కిలో బియ్యంపై రూ 42 సబ్సిడీ భరిస్తోంది. ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం పంపిణీ కొందరు అక్రమార్కులకు లాభాలను చేకూర్స్తోంది. లబ్ధిదారుల నుంచి రూ 15 కె డీలర్లు కొనుగోలు చేసి, నిల్వ ఉంచి బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఒకవైపు పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, మరోవైపు వారి అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని జరుగుతున్న ఈ అక్రమ రేషన్ దందా ప్రభుత్వ లక్ష్యాన్నే ప్రశ్నార్ధకంగా మారుస్తోంది. అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోతే తప్ప పేదల బియ్యం అక్రమార్కులకు బంగారంలా మారే ప్రమాదం ఉందని జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో తరచూ పట్టుబడుతున్న అక్రమ రేషన్ బియ్యం లారీలే అక్రమ రవాణా జోరుగా సాగుతుందని నిలువెత్తు సాక్షాలు.

ఆగస్టు 15వ తేదీ పాల్వంచ పోలీసులు అక్రమంగా తరలిస్తున్న 310 క్వింటాల రేషన్ బియ్యం లారీని, భద్రాచలంలో 15 రోజుల వ్యవధిలో రెండు దఫాలుగా 600 క్వింటాల బియ్యాన్ని తరలిస్తున్న రెండు లారీలను స్వాధీనం చేసుకోవడం, సోమవారం డేకులపల్లి మండలంలో అక్రమంగా రవాణా అవుతున్న 41 అల రేషన్ బియ్యం పట్టుబడటంతో బియ్యం అక్రమ రవాణా ఏ రీతిలో సాగుతుందో స్పష్టమవుతుంది. 

మూడు నెలల రేషన్ ఒకేసారి 

పేదల కడుపు నింపేందుకు  ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ఉచితంగా సన్నబియ్యం అందిస్తుంది, అదే కొందరి అక్రమార్కులకు వరంగా మారింది. గత ప్రభుత్వం సరఫరా చేసిన దొడ్డు బియ్యం స్థానంలో ప్రస్తుత ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుంటే కొందరు అక్రమార్కులు లబ్ధిదారుల నుంచి కిలో బియ్యం 15 కు కొనుగోలు చేస్తు  రేషన్ మాఫియా ప్రభుత్వ లక్ష్యాన్ని దెబ్బతీస్తోంది.

జిల్లాలో ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలలకు సంబంధించి ఉచిత సన్న బియ్యం పంపిణీకి సివిల్ సప్లై అధికారులు 443 రేషన్ దుకాణాల ద్వారా, 3,27,694 రేషన్ కార్డులకు చెందిన 9,67,106 మందు లబ్ధిదారులకు 1,84,992 క్వింటాల సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. అందుకోసం సుమారు రూ 78 కోట్ల ప్రజాధనం వెచ్చిస్తోంది. ప్రతి కిలోకు ప్రభుత్వం రూ 42 భారం మోస్తోంది. రేషన్ దుకాణాల డీలర్లు సమయపాలన పాటించి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం నాలుగు గంటల నుంచి 8 గంటల వరకు రేషన్ షాపులు తప్పనిసరిగా తెరిచి లబ్ధిదారులకు సక్రమంగా బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది.

అందుకు విరుద్ధంగా జిల్లాలో ఒక్క పూట మాత్రమే రేషన్ దుకాణాలు తెరిచి ఉంచడం గమనార్హం. గత ప్రభుత్వం హయాంలో దొడ్డు బియ్యం పంపిణీ పై ప్రజల అసంతృప్తిని గుర్తించిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన సన్న బియ్యం పంపిణీకీ  శ్రీకారం చుట్టింది. పేద కుటుంబాలు సన్న బియ్యం తినాలన్న ఉద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయం వేలాది కుటుంబాల్లో ఆనందం నింపింది. 

పేదల నోటికాడే కోడులాక్కుంటున్న అక్రమార్కులు 

ప్రభుత్వం కిలో కురు 42 ఇస్తుంది. ఆ బియ్యాన్ని కొంతమంది లబ్ధిదారులు 15 కె విక్రయిస్తున్నారు. అవే బియ్యాన్ని మార్కెట్లో రూ 50 చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం సదుద్దేశంతో చేపట్టిన ఈ పథకం కొంతమంది అక్రమార్కులు ఆ బియ్యాన్ని గోదాములకు మళ్లించి తర్వాత అధిక ధరలకు మల్లె ప్రజలకే అమ్మితే ప్రభుత్వానికి ఆర్థిక నష్టమే కాదు, పేదల ఆకలి పై జరిగే అక్రమ వ్యాపారం. ఉచిత సన్నబియ్యం ప్రతి ఇంటికి చేరి ప్రతి అన్నం గిన్నెలో అన్నంగా మారినప్పుడే సంక్షేమ పథకం నిజమైన పథకం గా రూపొందుతుంది. 

డీలర్లు రేషన్ మాఫియా..

కొంతమంది రేషన్ డీలర్లు రేషన్ మాఫియా అవతారమెత్తి లబ్ధిదారులనుంచి రో కిలో బియ్యం రూ 15 కు కొనుగోలు చేసి, వాటినే జిల్లాలోని కొంతమంది మిల్లర్లకు రూ 20 నుంచి రూ25 కు విక్రయిస్తున్నారు. వాటినే జిల్లాలోని కొంతమంది మిల్లర్లు ప్రభుత్వానికి కిలో రూ 42లకు రీసైక్లింగ్ చేస్తున్నారు. మరి కొంతమంది అక్రమార్కులు అధిక ధరలకు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తూ ప్రభుత్వ రాయితీని రేషన్ డీలర్ల జేబులోకి మార్చుకుంటున్నారు.

బియ్యం ధరపై ఎల్ నినో ప్రభావం..

ఈ ఏడాది వాతావరణ ప్రభావంతో ఏర్పడిన ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక ఖరీఫ్ సీజన్లో వరి దిగుబడి తగ్గే అవకాశాలు ఉంది. మార్కెట్లో బియ్యం ధర కిలో రూ 60 నుంచి రూ 70 వరకు పెరిగే అవకాశం ఉంటుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పరిస్థితిని ఆసరా చేసుకొనే కొంతమంది మిల్లర్లు, రేషన్ మాఫియా దారులు రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వచేసి వాటిని అధిక ధరలకు విక్రయించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

రెవెన్యూ నిర్లక్ష్యమే రేషన్ దందాకు అండ? 

రేషన్ షాపులు డీలర్ల ఎంపిక, ఆధరైజేషన్, లైసెన్సు మంజూరుకు కీలక బాధ్యత రెవెన్యూ శాఖ దే. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం పంపిణీ సక్రమంగా అమలవుతుందా, అక్రమార్కుల పాలవుతుందా అనే విషయాలను నిరంతరం పర్యవేక్షించాల్సిన బాధ్యత జిల్లా రెవెన్యూ అధికారుల పైనే ఉంది.

క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపించడంతో రేషన్ బియ్యం అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్ దందా నిరాటంగా సాగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమాలను నీ అంత నుంచే ఎందుకు అకస్మిక తనిఖీలు, స్టాకు దృవీకరణ, రవాణా పైనేగా వంట చర్యలు ఆశించిన స్థాయిలో లేవు.

రెవెన్యూ అధికారులు కఠినంగా వ్యవహరించి అక్రమార్కులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఈ రేషన్ దందాకు అడ్డుకట్ట ఉండదని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రభుత్వం అందించే ప్రజా పంపిణీ వ్యవస్థ నిజమైన లబ్ధిదారులకు చేరాలంటే జిల్లా పౌరసరఫరాల అధికారులు, రెవెన్యూ, పోలీస్ శాఖ, సివిల్ సప్లై విజిలెన్స్, అండ్ ఫోర్స్ మెంట్ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

జిల్లాలో ఏఏ మిల్లులకు బియ్యం తరలిపోతున్నాయి, పక్క రాష్ట్రాలకు ఎవరు తరలిస్తున్నారు, అన్న విషయాలపై నిగా పెట్టి కట్టడ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యం సంక్షేమ పథకం విజయవంతం అవుతుంది. ఎప్పటికైనా జిల్లా యంత్రాంగం అక్రమార్కులపై నిఘా పెడతారా, మామూళ్ల మత్తుకు తలకి నెమ్మకుంటారా వేచి చూడాల్సిందే.