1 September, 2026 | 11:33 PM

పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలి

01-09-2026 | 11:16pm

తపస్ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన

తపస్ జిల్లా అధ్యక్షులు బోనేకర్ సంతోష్

బాన్సువాడ,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఆర్డిఓ కార్యాలయం ముందు మంగళవారం తపస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలనీ డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని తెలిపారు. ఈ సందర్భంగా తపస్ జిల్లా అధ్యక్షులు బోనేకర్ సంతోష్(Tapas District President Bonekar Santosh) మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఆరు నెలల్లోపు ఉద్యోగ, ఉపాధ్యాయులకు అమలులో ఉన్న కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (old pension system) కొనసాగిస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ హామీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్షలకు అనుగుణంగా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తే, భవిష్యత్తులో మరింత విస్తృతమైన ఉద్యమ కార్యాచరణను ప్రకటించి, ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కుల కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించాడు.