చమురు సంస్థపై ఉక్రెయిన్ దాడి
29-06-2026 12:00 AM
మాస్కో, జూన్ 28: రష్యా చమురు శుద్ధి కర్మాగారంపై ఆదివారం ఉక్రెయిన్ విరుచుకుపడింది. ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడిలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడి సమీప ప్రాంతాల్లో పొగలు కముకున్నాయి. చమురు సంస్థకు భారీ నష్టం వాటిల్లిం ది. ఈ దాడిలో ఇద్దరు మృతిచెందినట్టు స్థానిక మీడియా వెల్ల డించింది.
ఉక్రెయిన్ దాడులతో మాస్కోకు నష్టాలు, రష్యా పౌరులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇటీవల ఉక్రెయిన్ ప్రయోగించిన రెండు డ్రోన్ విమానాలను కూల్చివేసింది. దీనికి ప్రతిస్పందనగా చమురు సంస్థపై డ్రోన్ దాడికి పాల్పడినట్టు స్థానిక మీడియా ప్రకటించింది.






