calender_icon.png 24 February, 2026 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేమతో నాన్న ఉగాది నంది పురస్కారాలు

23-02-2026 01:15:27 AM

ఉత్తమ నటుడిగా నిర్మల్ వాసి

ఉత్తమ నటి సుహాసిని

ఉత్తమ నటుడు డాక్టర్ వేణుగోపాలకృష్ణ.

నిర్మల్ ఫిబ్రవరి 22 (విజయక్రాంతి) : నిర్మల్ పట్టణంలో చెందిన ప్రముఖ వైద్యు లు డాక్టర్ వేణుగోపాల్ కృష్ణ నటించి దర్శకత్వం వహించిన లఘు చిత్రం ప్రేమతో నాన్న రెండవ భాగం , మొదటి చిత్ర భాగం ప్రేమతో నాన్న కి ఇదివరకే మంచి గుర్తింపు ,ఉత్తమ పురస్కారంలు అందుకున్నది. డాక్టర్ వేణుగోపాలకృష్ణ ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెన్డెంట్‌గా మంచి సేవలందించి పలు జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి అవార్డులు అం దుకున్నారు.

ప్రేమతో నాన్న చిత్రం కుటుం బ విలువలు, బంధాలు, అనుబంధాలు, సామాజిక స్పృహతో కూడిన బాధ్యతల నేపధ్యంలో నిర్మించారు మానవ సంబంధాలున్న మంచి కదాంశం ప్రేమతో నాన్న అని ప్రశంసించారు. ఉత్తమ చిత్రంతో పాటు ప్రేమతో నాన్న లో నటించిన డాక్టర్ సుహాసిని, డాక్టర్ వేణుగోపాలకృష్ణ ఉత్తమ నటీ, నటులుగా ఎంపికయ్యారు. తండ్రి కూతురు అయిన డాక్టర్ వేణుగోపాలకృష్ణ, డాక్టర్ సుహాసిని ఇద్దరూ వైద్యులు, నటులు అనేది విశేషం. హైదరాబాద్ బిర్లా ఆడిటోరియం లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పురస్కారాలు అందజేస్తామని నిర్వాహకులు మెగా ఎంటర్‌ప్రైజెస్ వారు తెలియజేశారు. డాక్టర్ సుహాసిని ,డాక్టర్ వేణుగోపాలకృష్ణ లను పలువురు అభినందించారు.