15 June, 2026 | 2:21 AM

కేంద్ర, రాష్ట్రాలు కలిస్తేనే అభివృద్ధి సాధ్యం

15-06-2026 01:12 AM

వేములవాడ, జూన్ 14 (విజయ క్రాంతి): రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వ స్తాయి.. అట్లనే కేంద్రం, రాష్ట్రం కలిస్తేనే అభివ్రుద్ధి సాధ్యం.. గత ప్రభుత్వ  మూర్ఖపు పా లనవల్ల తెలంగాణ చాలా నష్టపోయింది.. ప్ర స్తుత రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తున్నందువల్లే కేంద్రం నుండి నిధులొస్తున్నాయి.. గ్రామాలకు మండలానికి కనెక్ట్ చేసేలా తగిన నిధు లొస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం బొల్లారంలో స్థానిక ఎమ్మెల్యే, ప్ర భుత్వ విప్ ఆదిశ్రీనివాస్ తో కలిసి వేమలవాడ -సిరికొండ  రోడ్డు విస్తరణ పనుల్లో భా గంగా బొల్లారం నుండి సిరికొండ వరకు ర హదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశా రు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ అభివ్రుద్ది పనుల్లో భాగంగా సెంట్రల్ రోడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫం డ్ లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ నుండి సిరికొండ వరకు దా దాపు 18.21 కి.మీల మేరకు రోడ్డు విస్తరణ, బలోపేతం  చేసే పనులక శంకు స్థాపన చే యడం సంతోషంగా ఉందన్నారు. కేంద్రం సిఆర్‌ఐఎఫ్ కింద ఈ పనులకు 23 కోట్లు మంజూరు చేసిందని, ఒప్పందం ప్రకారం 6 నెలల్లో ఈ పనులను పూర్తి చేయాలని గడు వు విధించడం జరిగిందన్నారు.

మామిడిపల్లి, బావుసాయిపేట, రామన్నపల్లి, గోవిందరావుపేట తండా గ్రామాలతోపాటు ఈ రోడ్డు నుండి వెళ్లే ప్రయాణీకులకు, వాహనదారులకు ఎంతో సమయం ఆదా అవుతుందని తెలిపారు. గత 7 ఏళ్లలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ధి కోసం 22 వేల కోట్లకుపైగా కేంద్ర నిధులు తీసుకొస్తే, అందులో  రోడ్ల నిర్మాణం కోసమే 10 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు ఖ ర్చు చేశామని తెలిపారు. అందులో భాగం గా మేడిపల్లి గోవిందారం, మల్యాల నుండి కాచారం రోడ్ల విస్తరణ పనులకు 45 కోట్ల రూపాయలు ఖర్చు చేసి విస్తరించామని, కేవ లం జాతీయ రహదారుల విస్తరణ కోసమే 5 వేల  కోట్ల రూపాయలు తీసుకువచ్చామన్నారు.

ఇటీవల చొప్పదండి మండలం అర్నకొండ గ్రామం నుండి గోపాల్ రావు మీదుగా మల్యాల వరకు 50 కోట్ల రూపాయల వ్యయంతో 35 కిలోమీటర్ల మేరకు సింగిల్ రోడ్డును డబుల్ లేన్ రోడ్డుగా విస్తరించే పనులను ప్రారంభించుకున్నామన్నా రు. మొత్తం 50 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ రోడ్డును విస్తరించబోతున్నామన్నారు. జాతీయ రహదారుల విషయాని కొస్తే... 2 వేల 147 కోట్లు నిధులతో కరీంనగర్-వరంగల్ నేషనల్ హైవే, 578 కోట్ల రూపాయలతో ఎల్కతుర్తి-సిద్దిపేట నేషనల్ హైవే పనులు శరవేగంగా పూర్తవుతున్నాయన్నారు.

కరీంనగర్, జగిత్యాల ప్రజల చిరకాల వాంఛ గా ఉన్న కరీంనగర్- జగిత్యాల రోడ్డు విస్తరణ పనులకు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని,  దాదాపు 2 వేల 3 కోట్లకుపైగా నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు ప్రతాప రామక్రిష్ణ, చెన్నమనేని వికాస్ రావు, తదితరులు పాల్గొన్నారు.