31 July, 2026 | 3:27 AM

నాగోల్ పీఎస్‌కు ఇద్దరు కొత్త ఎస్సైలు

31-07-2026 01:54 AM

‘సూర్య నాయక్, మమతారెడ్డి బాధ్యతల స్వీకరణ 

నాగోల్, జూలై 30 (విజయక్రాంతి): నాగోల్ పోలీస్ స్టేషన్కు బదిలీపై వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్లు సూర్య నాయక్, మమతారెడ్డి గురువారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. స్టేషన్ సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ సమక్షంలో వారు రిపోర్ట్ చేయగా, విధుల బాధ్యతలను అప్పగించారు. 2014 బ్యాచ్కు చెందిన ఎస్త్స్ర సూర్య నాయక్ గతంలో చిక్కడపల్లి, బేగంపేట, తిరుమలగిరి, హయత్నగర్ పోలీస్ స్టేషన్లతో పాటు మల్కాజిగిరి ట్రాఫిక్ విభాగంలో సేవలందించారు.

రోడ్డు భద్రత విభాగానికి బదిలీ అయిన ఎస్త్స్ర వేణుగోపాల్ స్థానంలో ఆయన నాగోల్ పోలీస్ స్టేషన్లో బాధ్యతలు చేపట్టారు. అలాగే 2024 బ్యాచ్కు చెందిన ఎస్త్స్ర మమతారెడ్డి జవహర్నగర్ పోలీస్ స్టేషన్ నుంచి బదిలీపై నాగోల్కు వచ్చి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ ఇద్దరు అధికారులను అభినందిస్తూ, ప్రజలకు సత్వర, పారదర్శక పోలీసు సేవలు అందించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. కొత్త బాధ్యతల్లో ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తామని ఎస్సైలు తెలిపారు.