31 July, 2026 | 4:03 AM

నాలాపై స్లాబ్ వేయాలి

31-07-2026 01:53 AM

టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్

ఎల్బీనగర్, జులై 30: గడ్డి అన్నారం డివిజన్ లోని పీ అండ్ టీ కాలనీలో అసంపూర్తిగా వదిలేసిన నాలాపై స్లాబ్ పనులను పూర్తి చేయాలని అధికారులను టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ కోరారు.  పీఎన్టీ కాలనీలోని హుస్సేన్ మటన్ షాప్ చౌరస్తా వద్ద రోడ్డు తవ్వి వదిలేసిన పనులను గురువారం ఆయన పరిశీలించారు.

సరూర్నగర్ చెరువుకు అనుసంధానంగా ఉన్న డ్రెయిన్  వద్ద చాంబర్లో గుర్రెపు డెక్క ఇరుక్కుపోయిన పరిస్థితిలో  నాలా స్లాబ్ను తొలగించి, వాటర్ప్రూఫింగ్ పనులు నిర్వహించిన అనంతరం తిరిగి స్లాబ్ను అమర్చకుండా వదిలేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నాలాపై కొత్త స్లాబ్ ను వేసి ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని డిప్యూటీ కమిషనర్, ఈఈ ఇతర అధికారులను కోరారు. బోనాల పండుగ సందర్భంగా అమ్మవారికి బోనం సమర్పించే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వెంటనే ఆ చాంబ్ప స్లాబ్ పనులు పూర్తి చేసి ప్రజలకు రాకపోకలు చేసేలా ఇబ్బందులను  తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు మద్దెల సునీల్ బాబు, నాయకులు తులసి శ్రీనివాస్,  బద్దుల వేణుగోపాల్ యాదవ్, కందికంటి ప్రేమ నాథ్ గౌడ్, బబ్బురి ఆనంద్ కుమార్, పండరీనాథ్, శరత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.