29 May, 2026 | 2:05 AM

మేక పొట్టలో రెండు కిలోల ప్లాస్టిక్ తొలగింపు

29-05-2026 01:08 AM

కోదాడ, మే 28: హుజూర్నగర్ పట్టణంలో మేకలు పెంచుకుంటున్న ఉపేంద్రమ్మ తన మేక నెలరోజులుగా సరిగా మేతమేయక మధ్యమధ్యలో విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతుంటే గురువారం కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలకు తీసుకురాగా అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య శస్త్ర చికిత్స ద్వారా మేక పొట్టలోనుండి సుమారు మూడు కిలోలు ఉండచుట్టుకొని పోయిన ప్లాస్టిక్ కవర్లను తొలగించారు. శస్త్ర చికిత్సలో సిబ్బంది రాజు, చంద్రకళ, సాగర్, రాజేష్ పాల్గొన్నారు.