29 May, 2026 | 2:06 AM

మంత్రి ఉత్తమ్ చిత్రపటానికి క్షీరాభిషేకం

29-05-2026 01:10 AM

గరిడేపల్లి, మే 28: మండలంలోని గానుగబండ, కొండాయిగూడెం కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు మంత్రి ఉత్తమ్ చిత్రపటానికి గురువారం పాలాభిషేకం చేశారు. గానుగుబండ గ్రామానికి చుట్టూ ఉన్న అన్ని గ్రామాలకు గతంలో మట్టి రోడ్లు మా త్రమే ఉన్నాయని, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతో నేడు అన్ని తారు రోడ్లుగా మారాయన్నారు.

ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ పైడిమరి రంగనాథ్, మండల పార్టీ అధ్యక్షులు త్రిపురం అంజన్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధికి చిరునామాగా నిలిచిన మంత్రి ఉత్తమ్ గరిడేపల్లి మండల సర్వతో ము ఖాభివృద్ధికి పాటుపడుతున్నారని తెలిపారు. గానుగ బండ నుంచి మఠంపల్లి మండలంలోని హనుమంతల గూడెం వరకు, గానుగ బండ నుంచి కల్మలచెరువు వరకు, గానుగ బండ నుంచి పరెడ్డిగూడెం వరకు ఉన్న మట్టి రోడ్లను తొలగించి బీటీ రోడ్లను ఏర్పాటు చేయడం తో ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరిందన్నారు.

ఈ కార్యక్రమంలో కొండాయిగూడెం గ్రామ సర్పంచ్ కందుల మంగమ్మ కోటిరెడ్డి, గానుగ బండ మాజీ ఎంపీటీసీ పాకాల పరమేష్, గ్రామ శాఖ అధ్యక్షులు నాగేంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బచ్చలకూరి కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు ఆరే కృష్ణారెడ్డి, వరలక్ష్మి, సతీష్, శ్రీను, గ్రామ పెద్దలు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.