29 May, 2026 | 2:57 AM

ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్

29-05-2026 01:06 AM

మిర్యాలగూడ, మే 28: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం కోసం అనువైన స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలిస్తున్నారు. అందులో భాగంగా గురువారం మిర్యాలగూడ మండల పరిధిలోని కిష్టాపురం గ్రామ శివారులో ఉన్న స్థలాన్ని జిల్లా కలెక్టర్ బీ. చంద్ర శేఖర్ గురువారం మిర్యాలగూడ ఆర్డివో రమణారెడ్డితో కలిసి పరిశీలించారు.

ఈ సందర్బంగా కలెక్ట ర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నియోజకవర్గనికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి ప్రతిపదన చేసిందని అందులో భాగంగా స్థల పరిశీలన చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్లో ఒకే చోట సుమారు 2600 మంది విద్యార్థులు విద్యనభ్యసించే విధంగా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. విశాలమైన మైదానం, తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్లు, డైనింగ్ హాల్ తదితర సౌకర్యాల కల్పనకి అనువైన స్థలం  ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో మిర్యాలగూడ తహసిల్దార్ శ్రీనివాస్, ఆర్ ఐ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.