4 July, 2026 | 11:22 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

ఎడ్లబండ్లను ఢీకొన్న కంటైనర్.. రెండు ఎడ్లు మృతి

18-02-2026 11:10 AM

కామారెడ్డి, ఫిబ్రవరి 18, (విజయక్రాంతి): చెరుకు లోడ్​తో వెళ్తున్న ఎడ్లబండ్లను కంటైనర్ ఢీకొంది. దీంతో రెండు ఎడ్లు మృతి చెందగా ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ఘటన సదాశివనగర్  మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి శివారులో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నారాయణ్ ఖేడ్​కు చెందిన కూలీలు ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చెరుకు కొట్టడానికి వచ్చారు. ఈ క్రమంలో నాలుగు ఎడ్ల బండ్లపై చెరుకు లోడ్ చేసుకుని బుధవారం తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో అడ్లూర్​ ఎల్లారెడ్డి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీకి బయలుదేరారు.

డ్లూర్ ఎల్లారెడ్డి  శివారులోకి రాగానే కర్ణాటకకు చెందిన కంటైనర్ వేగంగా దూసుకువచ్చి ఎడ్ల బండ్లను ఢీకొడుతూ ముందుకు వెళ్లింది. ఈ ఘటనలో రెండు ఎడ్లు అక్కడికక్కడే మృతి చెందగా మరొక రెండు ఎడ్లకు తీవ్ర గాయలయ్యాయి. అలాగే ఓ వ్యక్తికి కూడా గాయలైనట్టుగా తెలుస్తోంది. అతన్ని చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టుగా సమాచారం. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అడ్లూర్​ ఎల్లారెడ్డి శివారులో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాలు జరిగే ఆస్కారమున్న ప్రాంతాల్లో రాత్రి, తెల్లవారుజామున వేగం తగ్గించి వెళ్లాలని పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ భారీ వాహనాల డ్రైవర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.