4 July, 2026 | 10:19 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను

04-07-2026 09:09 PM

చుంచుపల్లి,(విజయక్రాంతి): హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ గా కొత్తగూడెంకు చెందిన సాయి భాను నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ అధ్యక్షులు,బొడ్డపాటి దాసు నియామకపత్రాన్ని  అందచేశారు. శనివారం రాష్ట్ర కోఆర్డినేటర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సాయిబాను స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, ప్రజలకు మానవ హక్కులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు, చట్టాలపై అవగాహన కల్పిస్తానని హామీ ఇచ్చారు. జిల్లాల కమిటీలను సమన్వయపరుస్తూ సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేస్తానని అన్నారు. ఈ మేరకు తనకు పదవి కేటాయించిన జాతీయ అధ్యక్షులు బొడ్డపాటి దాసుకు, రాష్ట్ర అధ్యక్షులు కాల్వ సుధాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు.