4 July, 2026 | 10:21 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ

04-07-2026 09:02 PM

*  సేవల ధరల పెంపుకు నూతన కమిటీ తీర్మానం

వేములవాడ,(విజయక్రాంతి): వేములవాడ నాయీ బ్రాహ్మణ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని సభ్యులు శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సముద్రాల శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా సూత్రం శ్రీనివాస్, ఇన్నారం రమేష్, ప్రధాన కార్యదర్శిగా గడ్డం తిరుపతి, సంయుక్త కార్యదర్శిగా కొత్వల నర్సింహులు, కోశాధికారిగా వెలిశాల శ్రీకాంత్ ఎన్నికయ్యారు.

సలహాదారులుగా సూత్రం రమేష్, కళ్యాణం లక్ష్మణ్, గంగిపల్లి రవి, వెల్దిరాజు, సారం పెళ్లి సంతోష్లను ఎంపిక చేశారు. సమావేశంలో పెరిగిన నిర్వహణ వ్యయాల దృష్ట్యా హెయిర్ కటింగ్, షేవింగ్ తదితర సేవల ధరలను పెంచాలని నిర్ణయించారు. సభ్యుల సంక్షేమం, వృత్తి అభివృద్ధి, వినియోగదారులకు నాణ్యమైన సేవలందించేందుకు కృషి చేస్తామని నూతన అధ్యక్షుడు సముద్రాల శ్రీనివాస్ తెలిపారు.