4 July, 2026 | 9:57 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

కారు ప్రమాదంలో బీసీవై జిల్లా అధ్యక్షుడు మృతి

18-02-2026 10:57 AM

 కొల్చారం,(విజయ క్రాంతి):  అతివేగంగా వస్తున్న కారు చెట్టు నుండి కొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన బుధవారం తెల్లవారుజామున కొల్చారం శివారులో హైదరాబాద్ ప్రధాన రహదారిపై  జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, కొల్చారం పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ పట్టణానికి చెందిన వీవీ సిల్క్స్ యజమాని, బిసి వై పార్టీ జిల్లా అధ్యక్షులు వనపర్తి రోహిత్ గుప్తా, తన స్నేహితుడు కామారెడ్డి జిల్లాకు చెందిన  విజయ్ తో కలిసి  విజయవాడలో జరిగిన బీసీవై పార్టీ బిసి సింహ గర్జన కార్యక్రమానికి హాజరై తిరిగి మెదక్ కు వస్తున్న క్రమంలో రోహిత్ నడుపుతున్న కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టు కు ఢీ కొట్టి పక్కనే ఉన్న కోసి వేసిన చెట్టు మొదలు పై నుండి కిందికి వెళ్ళింది. ఈ సంఘటనలో రోహిత్ గుప్త అక్కడికక్కడే  మృతిచెందగా విజయ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే క్షతగాత్రున్ని 108 సహాయంతో మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుని  కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కొల్చారం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.