4 July, 2026 | 10:15 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

నీటి సంపులో పడి చిన్నారి మృతి

04-07-2026 08:55 PM

చందుర్తి,(విజయక్రాంతి): చందుర్తి మండలంలోని రామన్నపేట గ్రామంలో శనివారం సాయంత్రం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన తిప్పని జలంధర్-శిరీష దంపతుల కుమార్తె విశ్వైక (2) ఇంటి ముందు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందింది.

​తల్లిదండ్రులు వ్యవసాయ పనుల నుంచి తిరిగి వచ్చాక, తల్లి ఇంటి పనుల్లో నిమగ్నమైన సమయంలో చిన్నారి ఆడుకుంటూ వెళ్లి సంపులో పడిపోయింది. గమనించిన తండ్రి వెంటనే చిన్నారిని బయటకు తీసినప్పటికీ ఫలితం లేకపోయింది. కళ్ల ముందే రెండేళ్ల కూతురు అనంత లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.