లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు
04-07-2026 08:40 PM
నేరేడుచర్ల,(విజయక్రాంతి): లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు ఎస్.కె. యూసుఫ్ అధ్యక్షతన జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య వర్ధంతి మరియు బ్రిటిష్ పాలనకు ఎదిరించి వీరోచితంగా పోరాడిన అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని,వారి త్యాగాలు, సేవాభావం భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.






