4 July, 2026 | 10:21 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం

04-07-2026 09:00 PM

- మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి పలువురు శుభాకాంక్షలు

పినపాక,(విజయక్రాంతి): పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన పేరం వెంకటేశ్వర రావు ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వివిధ సంఘాల నాయకులు స్థానిక జానంపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం అత్యంత ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, స్వీట్లు తినిపించి అభినందనలు తెలిపారు. పేరం నాయకత్వంలో పార్టీ సిద్ధాంతాలు మరింత బలోపేతం అవుతాయని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన అంకితభావంతో పనిచేస్తారని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.