సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు
04-07-2026 08:53 PM
ప్రకృతి ప్రేమికురాలు నైనిక
మొక్కను ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన నైనిక
కొత్తగూడెం,(విజయక్రాంతి): కొత్తగూడెం ఒకటో టౌన్ సీఐ ఎం. కరుణాకర్ జన్మదినం సందర్భంగా, ప్రకృతి హరిత దీక్షకురాలు నైనిక రజువా పచ్చని మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నైనిక సీఎల్పీ బాగున్నారా మాట్లాడుతూ... పుట్టినరోజులు, వివాహాలు, ఇతర శుభకార్యాల్లో బొకేలకు బదులుగా మొక్కలను బహుమతిగా అందజేసే సంస్కృతిని, ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. మొక్కలను నాటి సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు సిబ్బంది, ప్రకృతి ప్రేమికులు పాల్గొని సీఐ కరుణాకర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.






