18-02-2026 11:27:46 AM
కొల్చారం కస్తూరిబా పాఠశాల ప్రత్యేక అధికారి నిర్వాహకం
కొల్చారం,(విజయక్రాంతి): మగవారు ఎవరికి కస్తూరిబా( Kasturba Girls Gurukul School) బాలికల గురుకుల పాఠశాలలోకి అనుమతి లేనిది, వెళ్లొద్దు అన్న నిబంధన ఉన్నప్పటికీ కొల్చారం కస్తూరిబా పాఠశాల ప్రత్యేక అధికారి నిర్లక్ష్యం మూలంగా నాయకులం అంటూ కొంతమంది వ్యక్తులు తరచూ పాఠశాలలోకి అనుమతి లేకుండా వెళ్లేస్తున్నారు. అయినప్పటికీ అధికారులు చూస్తూ చూడు నట్లు వ్యవహరించడం సర్వత్ర విమర్శలకు తావిస్తున్నది.
మండల కేంద్రమైన కొల్చారం లోని కస్తూరిబా బాలికల గురుకుల పాఠశాల లొకి ఎవరినీ జిల్లా విద్యాధికారి అనుమతి లేకుండా రావద్దని నిబంధన ఉన్నప్పటికీ కొంతమంది నాయకులు పాఠశాల ప్రత్యేక అధికారి మినహాయింపు నిచ్చారు. పండ్ల పంపిణీ జన్మదిన వేడుకల పేరిట తరచూ కొంతమంది నాయకులు కస్తూరిబా పాఠశాల లొకి వెళ్తున్నారు. ఈ విషయమై పాఠశాల ప్రత్యేక అధికారిని వివరణ కోరగా సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. జిల్లా విద్యాధికారి విజయను వివరణ కోరగా కస్తూరిబా బాలికల గురుకుల పాఠశాలలోకి ప్రవేశానికి ఎవరికి అనుమతి లేదని అనుమతి లేకుండా ప్రవేశిస్తే సంబంధిత ప్రత్యేక అధికారిపై చర్యలు తీసుకోమన్నట్లు తెలిపారు.