13 May, 2026 | 4:45 PM

Breaking News

చిత్ర పరిశ్రమలో మరో విషాదం: ప్రముఖ నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత   •   సీఎం రేవంత్ రెడ్డితో ఉబెర్ సీఈఓ భేటీ   •   జర్నలిస్ట్ కుమారుని వివాహానికి హాజరైన ఎమ్మెల్యే సామేలు   •   కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యునిగా రాపాక ప్రవీణ్   •   రైతులు పండించిన జొన్న పంట మొత్తం కొనుగోలు చేయాలి   •   గీతంలో పాఠశాల విద్యార్థుల కోసం యంగ్ ఎంటర్ ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్   •   నార్కో-టెర్రరిస్ట్‌ షేరా అరెస్ట్.. పోర్చుగల్ నుండి భారత్‌కు   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరినీ సమానంగా చూడటం లేదు   •   బొప్పపూర్ గ్రామంలో ప్లాస్టిక్ వాడకం నిషేధం   •   విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా షాక్   •  

ఇరాన్‌ ఖతార్‌పై దాడి చేస్తే.. గ్యాస్‌ఫీల్డ్ మొత్తాన్ని పేల్చేస్తాం

19-03-2026 01:18 PM
  1. ఇరాన్ చమురు, గ్యాస్ కేంద్రాలపై దాడులు చేయవద్దు
  2. చమురు, గ్యాస్ ధరలు పెరిగే అవకాశం: ట్రంప్
  3. ఇజ్రాయెల్ కు ట్రంప్ కీలక ఆదేశాలు

వాషింగ్టన్: ఇరాన్ చమురు, గ్యాస్ కేంద్రాలపై దాడులు చేయవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) సైన్యాన్ని ఆదేశించారు. చమురు, గ్యాస్ కేంద్రాలపై దాడులు వద్దని ఇజ్రాయెల్ ను ట్రంప్ ఆదేశించారు. చమురు, గ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉందని ట్రంప్ తెలిపారు. ఇరాన్ కు చెందిన సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ పై ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసింది.

సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్(South Pars gas field)పై దాడి చేస్తున్నట్లు ఇజ్రాయెల్ సమాచారం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. తమ సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ పై ఖతార్ దాడి చేసినట్లు ఇరాన్ ఆరోపిస్తోంది. ఖతార్ లోని రస్ లాఫాన్ గ్యాస్ క్షేత్రంపై ఇరాన్ క్షిపణి దాడి చేసింది. సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ పై దాడి ఘటనలో ఖతార్ కు సంబంధం లేదని ట్రంప్ వివరించారు. ఇరాన్ ఖతార్ పై దాడులు చేస్తే.. సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ ను ధ్వంసం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ శాంతియుతంగా ఉంటే సౌత్ పార్స్ పై దాడులు జరగవని ట్రంప్ మాటిచ్చారు.