ఇది అమెరికాకు స్వర్ణయుగం
సుంకాలపై మరోసారి ట్రంప్ క్లారిటీ.
సుంకాలు కొనసాగుతాయన్న ట్రంప్.
టారిఫ్ లపై సుప్రీంకోర్టు తీర్పు దురదృష్టకరం.
వాషింగ్టన్: టారిఫ్ లపై(Trump's Tariff) సుప్రీంకోర్టు తీర్పు దురదృష్టకరమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) అన్నారు. అమెరికా ఉభయసభలనుద్దేశించి డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. తన ప్రసంగం ప్రారంభానికి ముందే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ కు ట్రంప్ కరచాలనం చేశారు. సుంకాలపై మరోసారి ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. సుంకాలు కొనసాగుతాయని ట్రంప్ వెల్లడించారు. టారిఫ్ నిబంధనల మార్పుకు కాంగ్రెస్ అనుమతి అక్కర్లేదని చెప్పారు. తాము విధించిన టారిఫ్ లకు చట్టబద్దత ఉందని వివరించారు. అమెరికా పౌరులపై పన్నుల భారం తగ్గుతోందని ట్రంప్ తెలిపారు. అమెరికాకు స్వర్ణయుగం ప్రారంభమైందని వెల్లడించారు. అమెరికాను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.
2026 స్టేట్ ఆఫ్ ది యూనియన్ కార్యాక్రమం(2026 State of the Union Address) ఆరంభంలో ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. అక్రమ వలసలు, ఫెంటనిల్ కట్టడిపై భవిష్యత్తులో మరింత కట్టడి ఉంటుందని వెల్లడించారు. ఐదేళ్లలో అత్యల్ప స్థాయికి ద్రవ్యోల్బణాన్ని తీసుకెళ్లినట్లు ట్రంప్ తెలిపారు. తన కార్యవర్గం తొలి ఏడాదిలోనే 18 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. వెనెజువెలా(Venezuela) నుంచి 80 మిలియన్ బ్యారెళ్ల చమురు అమెరికాకు చేరింది. ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్- పాకిస్థాన్(India-Pakistan War) మధ్య అణు యుద్ధాన్ని తానే ఆపానని టముకు వేశారు. తాను యుద్ధం ఆపకుంటే పాక్ లో 35 మిలియన్ల జనం చనిపోయేవారని వెల్లడించారు. అమెరికా టారిఫ్ లను సమర్థించుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ లు విధించే హక్కు, అధికారాలు తనకే ఉన్నాయని పేర్కొన్నారు. అధ్యక్షుడిగా తనకు సర్వాధికారాలు ఉన్నాయని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.




