4 May, 2026 | 7:53 PM

పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్ర 4వ ర్యాంక్ సాధించిన గిరిజన బాలికకు ఘన సత్కారం

04-05-2026 06:30 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంక్‌ (594/600 మార్కులు) సాధించిన గిరిజన జాతికి చెందిన ప్రతిభావంతురాలు అజ్మీర్ అద్వైత నాయక్‌ను సోమవారం రోజు లంబాడీల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా లైవ్ నరేష్ నాయక్ మాట్లాడుతూ.. పదవ తరగతిలో టాపర్‌గా నిలిచిన బంజారా ముద్దుబిడ్డ అద్వైత నాయక్ ప్రతిభ ప్రతి ఒక్కరికీ ఆదర్శమని కొనియాడారు. ఆమె కృషి, పట్టుదల, అంకితభావం అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.అద్వైత నాయక్ భవిష్యత్తు బంగారుమయం కావాలని శుభాకాంక్షలు తెలిపారు.