calender_icon.png 14 February, 2026 | 4:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిట్యాలలో ట్రాన్స్‌జెండర్ విజయం

14-02-2026 12:40:30 AM

  1. రాష్ట్రంలో మొదటి కౌన్సిలర్ సుధాకర్
  2. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి గెలుపు

చిట్యాల, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): నల్లగొండ చిట్యాల మున్సిపాలిటీలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన ట్రాన్స్ జెండర్ ఘనవిజయం సాధించారు. చిట్యాల మున్సిపాలిటీలో శివనేనిగూడెంకు చెందిన ఒకటవ వార్డులో ట్రాన్స్ జెండర్ అయిన నాగిళ్ల సుధాకర్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచారు.

శుక్రవారం వచ్చిన ఫలితాల్లో సుధాకర్ 102 ఓట్ల మెజార్టీతో గెలుపొంది చిట్యాల మున్సిపాలిటీ రాజకీయ చరిత్రలో ఓ కొత్త అధ్యాయానికి తెర లేపారు. రాష్ట్రంలో మొదటిసారిగా ట్రాన్స్‌జెండర్ ఒక కౌన్సిలర్‌గా గెలుపొందడమే కాక ప్రజాస్వామ్య విలువలకు ప్రతీకగా నిలిచాడు. వివిధ ప్రధాన పార్టీలు పోటీలో ఉన్న కూడా తట్టుకొని  102 ఓట్ల మెజారిటీని అందించి వార్డు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు.

ప్రచార దశ నుంచే ప్రజల సమస్యలపై స్పష్టమైన అవగాహన, పారదర్శక పరిపాలనపై హామీ, సామాజిక సమానత్వంపై దృష్టి ఇవి సుధాకర్‌కు బలంగా నిలిచాయి. ముఖ్యంగా మహిళలు, యువత అణగారిన వర్గాల నుంచి స్పష్టమైన మద్దతు లభించింది. స్థానిక ప్రజలు మా సమస్యలను అర్థం చేసుకొని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చిన  అభ్యర్థిని గెలిపించాం అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.