11 July, 2026 | 3:43 AM

ప్రజాపాలనలో అన్నివర్గాల అభివృద్ధి

11-07-2026 02:37 AM
  1. పశుసంవర్ధక మంత్రి వాకిటి శ్రీహరి 
  2. అంతర్జాతీయ చేపల మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన 

అబ్దుల్లాపూర్ మెట్, జులై 10(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రజాపాలనలో అన్ని వర్గా ల ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తామని పశుసంవర్ధక శాఖ, మత్స్యకార మంత్రి వాకి టి శ్రీహరి అన్నారు. జాతీయ మత్స్య రైతు ల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారంమండల పరిధి కొహెడలో ఇబ్రహీంప ట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలి సి మంత్రి అంతర్జాతీయ చేపల మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ హైద రాబాద్ ఇంటర్నేషనల్ విమా నాశ్రయానికి అతి చేరువలో మార్కెట్ నిర్మించుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. మార్కెట్ నిర్మాణం కోసం రూ.50 కేటాయించినట్లు తెలిపారు. అదేవిధంగా మరో 50 కోట్లు అదనంగా కేటాయి స్తూ త్వరగా మార్కెట్ పూర్తిచేసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. మార్కెట్ నిర్మాణంతో ఈ ప్రాంత ప్రజలకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి దొరుకుతుం దని ఆశాభావం వ్యక్తం చేశారు.

మార్కెట్‌లో ప్రతిరోజు 10 ట న్నుల చేపల ఉత్పత్తి అవుతాయన్నారు. ఒక ముదిరాజు బిడ్డగా ముదిరాజుల అభివృద్ధి కోసం సహాయశక్తుల కృషి చేస్తానని అన్నా రు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి మాట్లాడుతూ... ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని  గత పాలకులు చేసింది శూన్యమేన ని అన్నారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో ని యోజకవర్గానికి అంతర్జాతీయ మార్కెట్లతో కోహెడ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.