కాల్చి చంపుతా అన్నా రాజీపడను
- ప్రజల కోసం దేనికైనా సిద్ధం
- ఎంపీ ఈటల రాజేందర్
సికింద్రాబాద్, జూలై10 (విజయక్రాంతి): నేను తెలంగాణ మట్టిబిడ్డను, ఉద్యమ కారున్ని, అదే నా గుర్తింపు అన్ని మల్కాజ్‌గిరి ఎం పీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. శుక్రవారం సిక్ విలేజ్ గాయత్రి గార్డెన్స్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి అంటూ చేస్తున్న విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోను, చీల్చి చెం డాడుతానన్నారు.
మేము స్వయం ప్రకాశితులం, ఎవరో మాట్లాడిస్తేనో, స్క్రిప్ట్ రాసి ఇస్తేనో, ఎవరి మెప్పుకోసమే మా ట్లాడే వాళ్ళం కాదన్నారు. అలా ఆరోపించే నీచులకు నేను సమాధానం చె ప్పాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీని ఇంకో పార్టీని తిట్టడానికి రాలేదని, పని చేయాల్సిన వారిని అడుగుతు న్నానని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ అం టే ఒక్క మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే కాదు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష్మి, అన్నా రం, సుందిళ్ల, మిడ్ మానేరు, అనంత సాగర్, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, బస్వాపూర్ ఇన్ని బ్యారేజులు, వందల కిలోమీ ట్లర్ల కాలువలు ఉన్నాయని వివరించారు. దేవాదులకు బెరాజ్ లేదు, లేకుం డా నీళ్ళు పంపు చేస్తున్నారు.
మేడిగడ్డలో నీళ్ళు నింపమని అడగడం లేదు. కిందకు పోతున్న నీళ్లను పంపు చెయ్యమని అడుగుతున్నానన్నారు. ప్రాజెక్టుకు లక్ష కోట్లు ఖర్చు పెడితే లక్ష కోట్లు తి న్నారు అనడానికైనా జ్ఞానం ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలు చేసి రైతులను ఇబ్బంది పెడితే ఖబర్దార్ అన్ని హెచ్చరించారు. హైదరాబాద్‌కు నీటికొరత వస్తే ఏం చేయాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్‌డీఎస్‌ఏ చెప్పిన దాన్ని వ్యతిరేకించడం లేదన్నారు.






