11 July, 2026 | 3:05 AM

పీజీఐ ర్యాంకుల్లో రెండో స్థానంలో మంచిర్యాల జిల్లా

11-07-2026 01:58 AM
  1. గతేడాదితో పోల్చితే మెరుగైన విద్య, సౌకర్యాలు..
  2. ర్యాంకులు విడుదల చేసిన కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ- 
  3.   36 స్కోర్‌తో ర్యాంకు మెరుగై ఉత్తమ్ లోకి... 
  4. విద్యారంగంపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

మంచిర్యాల, జూలై 10 (విజయక్రాంతి) : కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ 2025 - 26 విద్యా సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (పీజీఐ) ర్యాంకులలోజనగామ జిల్లా 383 స్కోరుతో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవగా, మం చిర్యాల జిల్లా 360 స్కోర్ తో రెండవ స్థానం లో నిలిచింది. 2024-25 విద్యా సంవత్సరంలో మంచిర్యాల జిల్లా 324 స్కోర్ తో రాష్ట్రంలోమూడవ స్థానంలో నిలిచింది.

ఈ ఏడాది కలెక్టర్ కుమార్ దీపక్ విద్యా శాఖపై మరింతగా దృష్టి సారించారు. జిల్లాలో కలెక్టర్ విజిట్ ఏ మండలంలో ఉన్నా సమీప వి ద్యా సంస్థను తప్పకుండా విజిట్ చేసి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, వసతులను అడిగి తెలుసుకోవడమే కాకుండా విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకుంటూ ఉపా ధ్యాయులకు సలహాలు, సూచనలు అందించారు.

వారంలో ఒక రోజు జిల్లా విద్యాశాఖా ధికారితో ఆయా మండలాల ఎంఈఓలతో రివ్యూ మీటింగ్ లు నిర్వహిస్తూ ఎప్పటికప్పు డు విద్యార్థులకు అందిస్తున్న విద్యా ప్రమాణాలపై దృష్టి సారించారు. దీనితో ఈ ఏడా ది అన్ని విభాగాలలో ప్రతిభ మెరుగుపడి 360 స్కోర్‌తో రెండవ స్థానంలో నిలిచింది. 

36 స్కోర్ తో ర్యాంకు మెరుగై ఉత్తమ్ లోకి..

పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ లో గత ఏడాది 324 స్కోర్ తో ప్రచేష్ట విభాగంలో జిల్లా నిలువగా, ఈ ఏడాది 36 మార్కులు అధికంగా సాధించి 360 స్కోర్ తో ఉత్తమ్ విభాగంలోకి ఉన్నతీకరణ చెందింది. ఫలితాలు (అభ్యసన ఫలితాలు, నాణ్యత, అందు బాటు ఫలితాలు, ఉపాధ్యాయుల లభ్యత, వృత్తిపరమైన అభివృద్ధి ఫలితాలు) వర్గంలో 151 స్కోర్ చేయగా, సమర్ధవంతమైన తరగతి గది భోదన (అభ్యసనా నిర్వహణ, సుసంపన్న కార్యకలాపాలు)లో 65, మౌలిక సదుపాయాలు, వసతులు, విద్యార్థుల హక్కులలో 44, పాఠశాల భద్రత, పిల్లల రక్షణ లో 29, డిజిటల్ అభ్యసనములో 26, పాల నా ప్రక్రియలు (నిధుల సమీకరణ, వినియో గం, హాజరు పర్యవేక్షణ వ్యవస్థలు, పాఠశాల నాయకత్వ అభివృద్ధి) వర్గంలో 45 స్కోరు తో 360 సాధించి రాష్ట్రంలో రెండవ స్థానం లో నిలిచింది.

అలాగే తెలంగాణ రాష్ట్రము సైతం తన స్థానాన్ని మెరుగుపరచుకొని జా తీయస్థాయిలో 18వ స్థానంలో నిలిచింది. పాఠశాలల్లో పర్యవేక్షణ మెరుగుపరడానికి దాదాపుగా 50 మంది సభ్యులతో 8 తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి 485 పాఠశాలలను పూర్తిస్థాయిలో సమగ్రంగా తనిఖీ చే యడం వలన ఉపాధ్యాయులలో ప్రణాళిక బోధన మెరుగయ్యి, పనితీరు పెరిగి, పాఠశాలల పనితీరు మెరుగయ్యి బోధన, అభ్యసనా ప్రమాణాలు పెరిగి అభ్యసనా స్థాయిలు పెరి గి 2024- కంటే మెరుగైన స్కోరును సా ధించింది. అలాగే ఐఎఫ్పీలు, ఐసీటీల ద్వా రా డిజిటల్ విద్యను బలోపేతం చేయడం వ లన డిజిటల్ విద్యా విభాగంలో సైతం స్కోరు మెరుగైందని చెప్పవచ్చు.

విద్యారంగంపై బాస్ ప్రత్యేక దృష్టి..

ప్రభుత్వ విద్యా సంస్థలలో విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందించడంపై కలెక్టర్ ఆది నుంచే దృష్టి సారిస్తున్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో తాగునీరు, విద్యుత్, విద్యార్థినీ, విద్యార్థులకు వేరువేరుగా మూత్రశాలలు, భోజనశాల, అదనపు గదులు, ప్రహరీ గోడ ఇతర సదుపాయాలు కల్పించినాణ్యమైన విద్యను అందించేందుకు తనవంతు కృషి చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా విద్యారంగంలో ఉన్నత స్థానంలో నిలిపేందుకు ఈ ఏడాది జిల్లాలో దాదాపు 320 మంది ఉపాధ్యాయులను నియమించారు.

గత ఏడాది పోలిస్తే ఈ విద్యా సంవత్సరంలో 3 శాతం విద్యార్థుల సంఖ్య పెరిగి అడ్మిషన్లలో జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ముఖ గుర్తిం పు ద్వారా 75 శాతం హాజరు నమోదు చేస్తున్నారు. జిల్లాలో 700 లకు పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉండగా దాదాపు 44 వేల మం ది విద్యార్థులు చదువుతున్నారు. కేజీబీవీ, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలతో విద్యార్థులకు విద్యా అం దించడం జరుగుతుంది.

జిల్లాలో విద్యారంగానికి రూ. 150 కోట్లు ఖర్చు చేస్తుంది. ఇం దులో సి.ఎస్.ఆర్. 80 కోట్ల రూపాయలు, ఈ.జి.ఎస్. 20 కోట్ల రూపాయలు, సమగ్ర శిక్ష 11 కోట్ల రూపాయలు, నాబార్డు 6 కోట్ల రూపాయలు, ప్రధానమంత్రి జన్ మన్ 3 కోట్ల రూపాయలు, ప్రధానమంత్రి జుగా 3 కోట్లతో పాటు ప్రభుత్వ నిధులతో పాఠశాలల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. 

సౌకర్యాలు సైతం మెరుగుకు కృషి..

ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో సౌ కర్యాల మెరుగుకు కలెక్టర్ కుమార్ దీపక్ ప్ర త్యేకంగా కృషి చేస్తున్నారు. టాయిలెట్స్ లేని పాఠశాలలను గుర్తించి డీఎంఎఫ్టీ, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకాల నుంచి మంజూరు చేసి మౌలిక వసతులను బలోపేతం చేయ డం, అమ్మ ఆదర్శ పాఠశాల పనుల ద్వారా పాఠశాలల్లో త్రాగునీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం, తరగతి గదులకు అవసరమైన రిపేర్లను చేపట్టడం, ఇప్పటికే ఉన్న టాయిలెట్స్ కి అవసరమైన మరమ్మత్తులను చేపట్టి టా యిలెట్లలో రన్నింగ్ వాటర్ సౌకర్యం కల్పిస్తున్నారు.

డీ ఎం ఎఫ్ టీ, సమగ్ర శిక్ష, నాబార్డ్ నిధులతో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు(కేజీబీవీ), ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్)లకు అనుబంధంగా ఉన్న బాలికల వసతి గృహాలలో విద్యార్థులకు అదనంగా డార్మెటరీస్ నిర్మించడం, డైనింగ్ హాలు, కిచె న్ షెడ్డు, టాయిలెట్స్ నిర్మించడం, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్ లు నిర్మించడం, ఆర్‌ఓ వాటర్ ప్లాంట్లను, కేజీబీవీలలో ఇంటర్మీడియట్ బ్లాక్ లను నిర్మించడం తదితర మౌలిక వసతులు కల్పిస్తున్నారు. వీటితోనే మౌలిక వసతుల విభాగంలో ఎక్కువ స్కోరు సాధించింది. ప్రతి స్కూల్ ఫెసిలిటీ అండ్ మెయింటనెన్స్ గ్రాంట్ నుంచి సర్వీస్ పర్సన్ లను నియమించడం వలన పాఠశాలల నిర్వహణ మెరుగైందని చెప్పవచ్చు. 

విద్యారంగంపై ప్రత్యేక దృష్టి.. 

విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించాం. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు మెరుగవ్వడానికి, వాటిపైన పర్యవేక్షణ పెరగడానికి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం హాజరును పకడ్బందీగా అమలు చేస్తున్నాం. దీనితో హాజరు శాతం పెరిగి ఇది పాఠశాల పనితీరు మెరుగై పాఠశాల పనితీరు పాలనా విభాగంలో స్కోర్ పెరిగింది.

ఉపాధ్యాయులకు ఎఫ్ ఎల్ ఎన్, ఎల్‌ఐపి పైన శిక్షణలు ఇవ్వడం వలన ఉపాధ్యాయుల ప్రొఫెషనల్ డెవలప్మెంట్ విభాగంలో స్కోర్ పెరిగింది. ఇలా అన్ని విభాగాలలో ఎప్పటికప్పుడు సమీక్షించుకొని మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సహకారంతో జిల్లా రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలిచింది.

కుమార్ దీపక్, జిల్లా కలెక్టర్, మంచిర్యాల