13 June, 2026 | 12:56 AM

మల్టీ జోన్-1 పరిధిలో ఎనిమిది మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ

12-06-2026 07:44 PM

మంథని,(విజయక్రాంతి): మల్టీ జోన్-1 పరిధిలో పనిచేస్తున్న ఎనిమిది మంది పోలీస్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఐజిపి చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఈ బదిలీలు చేపట్టినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

బదిలీల వివరాలు

  •  ఆసిఫాబాద్  సిసిఎస్ నుండి బుద్దే స్వామి మంథని సర్కిల్‌కు బదిలీ అయ్యారు.
  •  మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు ఐజిపి కార్యాలయానికి బదిలీ అయ్యారు.
  •  ఖమ్మం సిఎస్‌బి నుండి ఎల్లయ్య అశ్వాపురానికి బదిలీ అయ్యారు.
  •  అశ్వాపురం నుండి అశోక్ ఖమ్మం సిఎస్‌బికి బదిలీ అయ్యారు.
  •  వేణుచందర్  మంచిర్యాల ట్రాఫిక్ నుండి రామగుండం సిఎస్‌బికి బదిలీ,
  •  హన్నాన్ రామగుండం సిఎస్‌బి నుండి మంచిర్యాల ట్రాఫిక్‌కు బదిలీ,
  •  కృష్ణమూర్తి మెదక్ సిసిఎస్ నుండి మెదక్ రూరల్ సర్కిల్‌కు బదిలీ,
  •  జార్జ్ మెదక్ రూరల్ నుండి ఐజిపి కార్యాలయానికి బదిలీ అయ్యారు. 

వీరిని వెంటనే రిలీవ్ అయ్యి కొత్త బాధ్యతల్లో చేరవలసిందిగా ఐజిపి ఆదేశాల్లో పేర్కొన్నారు.