13 May, 2026 | 1:52 PM

Breaking News

పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణ.. బండి భగీరథ్ రాకపై ఉత్కంఠ   •   విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •  

బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం.. 24 మంది జలసమాధి.. నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

26-03-2026 03:43 PM

బంగ్లాదేశ్‌లో నదిలోకి దూసుకెళ్లిన బస్సు

24 మంది మృతి, గల్లంతైన వారి కోసం గాలింపు

ఢాకా: బంగ్లాదేశ్‌లో(Bangladesh) ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. రవాణా ఫెర్రీని(Ferry) ఎక్కే ప్రయత్నంలో ఒక ప్రయాణీకుల బస్సు పద్మా నదిలోకి(Padma River) దూసుకెళ్లడంతో 24 మంది మరణించారని, మరికొందరు గల్లంతయ్యారని అధికారులు గురువారం తెలిపారు. బుధవారం సాయంత్రం సుమారు 5:15 గంటలకు నైరుతి జిల్లాలోని రాజ్‌బారిలో గల దౌలాడియా టెర్మినల్ వద్ద ఒక బస్సు పద్మా నదిలో పడిపోవడంతో ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. 

ఢాకా వెళ్తున్న ఆ బస్సులో పలువురు పిల్లలతో సహా సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారని, వారిలో అత్యధికులు ఈద్ సెలవుల అనంతరం రాజధానికి తిరిగి వస్తున్నవారేనని అంచనా వేస్తున్నారు. అదుపు తప్పి బోల్తా పడిన(Bus Overturnsబస్సు నదిలో దాదాపు తొమ్మిది మీటర్ల లోతుకు మునిగిపోయిందని అధికారులు తెలిపారు. సహాయక బృందాలు ఇప్పటివరకు 22 మృతదేహాలను వెలికితీశాయి. వీరిలో 6 మంది పురుషులు, 11 మంది మహిళలు,5 మంది చిన్నారులు ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.