26 March, 2026 | 1:13 PM

Breaking News

బీఆర్ఎస్ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ దుర్వినియోగం.. ఎవరు కాజేశారో తెలుసు!   •   మార్కాపురం బస్సు అగ్నిప్రమాదం — 13 మంది సజీవ దహనం, హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!   •   మార్కాపురం బస్సు దుర్ఘటనపై మోదీ సంతాపం — 14 మంది మృతికి రూ.2 లక్షల పరిహారం!   •   దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు సమాధానం   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై స్పందించిన కేంద్రమంత్రులు   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి   •   కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసిన జాతీయ ఆర్ఎంపీ, పీఎంపీ జేఏసీ నాయకులు   •   డ్రైవర్ నిర్లక్ష్యంతో నరకం — మార్కాపురంలో 13 మంది సజీవ దహనం, డ్రైవర్ పరారు!   •   పట్నంలో ‘పాత రాతియుగం పనిముట్లు’   •   శ్రీరామనవమి నాడు కవిత కొత్త పార్టీ   •  

మార్కాపురం బస్సు అగ్నిప్రమాదం — 13 మంది సజీవ దహనం, హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!

26-03-2026 11:55 AM

మార్కాపురం: ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో(Markapuram Road accident) 13 మంది సజీవ దహనమవ్వగా, మరో 28 మందికి పైగా గాయపడిన ఘటన నేపథ్యంలో అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.  బాధితుల కుటుంబాలు సమాచారాన్ని పొందడానికి, తగిన సహాయాన్ని అందుకోవడానికి వీలుగా ప్రభుత్వం హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది.

గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించినట్లు, బాధితులను గుర్తించి అవసరమైన సహాయం అందించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద బాధితులకు సంబంధించిన వివరాలను తెలుసుకోవాలనుకునే కుటుంబ సభ్యులు ఈ క్రింది నంబర్ల ద్వారా నియంత్రణ కేంద్రాన్ని సంప్రదించవచ్చు: 6304285613, 9985733999, 7989537285, 9703578434. ప్రమాదానికి గల కారణంపై తదుపరి విచారణ కొనసాగుతోంది.

ప్రమాదానికి గురైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నంబర్: AR20D0487. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులున్నారు. మృతులు, క్షతగాత్రులందరూ 30 ఏళ్ల లోపు వాళ్లేనని అధికారులు ప్రకటించారు. చాలా మందికి 40 శాతం వరకు కాలిన గాయాలయ్యాయి. కొందరికి కాళ్లూ చేతులు విరిగిపోగా, మరికొందరికి తలకు గాయాలయ్యాయి. బస్సులో జగిత్యాల నుంచి ఇద్దరు, కోరుట్ల నుంచి ఆరుగులు ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. జీవనోపాధి కోసం కార్మికులు ఏపీ నుంచి జగిత్యాలకు రాకపోకలు కొనసాగిస్తున్నారు.