మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు
మంథని,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని దేవరంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కామిడి శ్రీనివాస్ రెడ్డి తండ్రి కామిడి మల్లారెడ్డి మృతిచెందిన విషయం తెలుసుకున్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు సోమవారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన శ్రీను బాబు, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మల్లారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ఆ కుటుంబానికి ప్రసాదించాలని భగవంతుడిని కోరారు. ఈ పరామర్శ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొని మల్లారెడ్డి సేవలను స్మరించుకున్నారు.






