అన్నింటిపై సోషల్ మీడియా ప్రభావం
హైదరాబాద్: అన్నింటి పై సోషల్ మీడియా అతిపెద్ద ప్రభావం చూపిస్తోందని మహేశ్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud) పేర్కొన్నారు. మహేష్ కుమార్ గౌడ్, AICC మీడియా ప్యానలిస్ట్ సరళ్ పటేల్, మీడియా కమిటీ ఛైర్మన్ సామ రామమోహన్ రెడ్డితో కలిసి గాంధీభవన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.... సంకుచిత మనస్తత్వం వీడి.. విశాల దృక్పథంతో పనిచేయాలని రాహుల్ గాంధీ(Rahul Gandhi) పిలుపునిచ్చారని మహేశ్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర, దేశ రాజకీయాలపై యువత అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు. మంచి సబ్జెక్టు ఉండి బాగా మాట్లాడేవారిని ప్రోత్సహించాలని రాహుల్ గాంధీ చెప్పారని ఆయన వివరించారు. రాహుల్ గాంధీకి స్వార్థం ఉంటే 2004, లేదా 2009లో ప్రధానమంత్రి అయ్యుండేవారని వెల్లడించారు. తనకు పదవులకంటే దేశం ముఖ్యమని రాహుల్ గాంధీ భావించారని వివరించారు.






